మార్నింగ్ టీకి బదులు ఈ హెల్తీ డ్రింక్స్ తాగండి.. ఆరోగ్య పరంగా అద్భుత ప్రయోజనాలు పొందుతారు..
చాలా మందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే టీ ప్రేమికులు రోజంతా టీ తాగుతూనే ఉంటారు. కానీ, ఇది హానికరమైన అలవాటు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయం పూట నిద్రలేచిన వెంటనే కాఫీ, టీలకు బదులుగా తీసుకోవాల్సిన కొన్ని హెల్తీ డ్రింక్స్ ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jul 20, 2023 | 4:08 PM

ఉదయం లెమన్ టీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్టయితే, లేదంటే అందమైన చర్మం కావాలనుకునేవారైతే లెమన్ టీ తాగవచ్చు.

ఉదయం పూట టీకి బదులు గ్రీన్ టీ తీసుకోవటం ఉత్తమం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది హెల్తీ డ్రింక్‌గా సూచిస్తున్నారు.

ఉదయాన్ని తేనె కలిపిన నీటిని తాగడం ద్వారా కూడా మీరు మీ రోజును ప్రారంభించవచ్చు. పరగడుపునే తేనె కలిపిన నీటిని తాగటం ద్వారా మీరు రోజంతా శక్తి వంతంగా ఉండగలుగుతారు.

అంతేకాదు.. ఉదయం పూట టీ కి బదులుగా మీరు కుంకుమ పువ్వు నీళ్లు కూడా తాగొచ్చు. బరువు తగ్గాలని ప్రయత్నించేవారు కూడా కుంకుమపువ్వు నీరు తాగితే ప్రయోజనం ఉంటుంది.

టీకి బదులుగా, మీరు పండ్లు, కూరగాయలను ఉపయోగించి స్మూతీని తయారు చేసుకోవచ్చు. ఇది కూడా మీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఉదయం పూట టీకి బదులు బ్లాక్ కాఫీ తాగడం కూడా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీకి బదులుగా పైన పేర్కొన్న ఏవైనా ఎంపికలను ఉపయోగించవచ్చు.





























