- Telugu News Photo Gallery Coffee Side Effects These 5 People Dont Drink Coffee Problems Will Increase
Health Tips: ఈ వ్యాధులు ఉన్నవారు కాఫీ అస్సలు తాగొద్దు.. జర జాగ్రత్త.. లేనిపోని సమస్యలు వస్తాయి!
ప్రపంచవ్యాప్తంగా కాఫీ లవర్స్ చాలామందే ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొంతమందికి కాఫీ తాగనిదే రోజు గడవదు...
Updated on: Aug 21, 2021 | 1:07 PM

ప్రపంచవ్యాప్తంగా కాఫీ లవర్స్ చాలామందే ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొంతమందికి కాఫీ తాగనిదే రోజు గడవదు. అంతలా ఎడిక్ట్ అవుతారు. ఉదయాన్నే బెడ్ కాఫీ తాగితేనే గానీ తమ రోజు మొదలుపెట్టరు. అయితే కాఫీ లిమిట్‌గా తాగితే ఫర్వాలేదు. కాని అధిక మోతాదులో తీసుకుంటేనే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఈ వ్యాధులు ఉన్నవారు కాఫీని అస్సలు తాగకూడదు. వాళ్లు ఎవరో తెలుసుకుందాం పదండి.!

మీరు మైగ్రేన్ సమస్యతో బాధపడుతుంటే.. అస్సలు కాఫీ తాగొద్దు. కాఫీలో కెఫిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడు నరాలపై ప్రభావం చూపిస్తుంది. అలాగే రక్త ప్రసరణ కూడా మందగిస్తుంది. అధిక మొత్తంలో కెఫిన్ శరీరంలోకి చేరితే.. మైగ్రేన్ మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది.

మీకు హై-బీపీ ఉన్నట్లయితే.. కాఫీ తాగకండి. కాఫీ తాగడం వల్ల రక్తపోటు స్థాయి మరింతగా పెరుగుతుంది. దాని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే కాఫీ తాగడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దీంతో బీపీలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు.

డయాబెటిక్ పేషెంట్లు కాఫీ తాగడం మానేయాలని చాలామంది ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాఫీ తాగడం వల్ల డయాబెటిక్ రోగులకు అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. రక్తంలో చక్కెర స్థాయి అసమత్యుల్యంగా ఉన్నవారు కూడా కాఫీ తాగకూడదు.

గర్భధారణ సమయంలో కాఫీ తాగడం మంచిది కాదు. కాఫీలో ఉండే కెఫిన్ శాతం మీ శరీరంలోని రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల కడుపులో పెరుగుతున్న పిండానికి రక్తం సరఫరాలో అసమతుల్యత ఏర్పడుతుంది.

ఒకవేళ మీకు ఒత్తిడిని ఎదురుకుంటున్నట్లయితే.. కాఫీ గురించి అస్సలు ఆలోచించొద్దు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాఫీని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో కార్టిసోల్ హార్మోన్‌పై అధిక ప్రభావం పడుతుంది. ఇది ఒత్తిడిని మరింత ఎక్కువ చేస్తుంది.




