- Telugu News Photo Gallery Cinema photos Young Heroine Krithi Shetty is back with sharwa 35 and jayam ravi movies in film industry Telugu Actress Photos
Krithi Shetty: బేబమ్మ జాతకం మారుతుందా.? విజయాలు లేని కృతి శెట్టికి ఉన్నట్లుండి ఆఫర్స్ క్యూ.?
బేబమ్మ జాతకం మారుతుందా..? ఏడాదిగా సరైన విజయాలు లేని కృతి శెట్టికి ఉన్నట్లుండి ఆఫర్స్ క్యూ కట్టడం వెనక అసలు కారణమేంటి..? శ్రీలీల రీసెంట్ ఫెయిల్యూర్స్ ఈమెకు హెల్ప్ అవుతున్నాయా లేదంటే మిగిలిన భాషల్లో కృతి శెట్టిని కొత్తగా ఫీల్ అవుతున్నారా.? ఈ రెండూ కాదంటే గ్లామర్ డోర్స్ ఓపెన్ చేయడం ఉప్పెన బ్యూటీకి కలిసొస్తుందా..? టైటిల్‌కు తగ్గట్లే ఉప్పెనలా ఇండస్ట్రీకి దూసుకొచ్చిన బ్యూటీ కృతి శెట్టి.
Updated on: Feb 11, 2024 | 5:55 PM

బేబమ్మ జాతకం మారుతుందా..? ఏడాదిగా సరైన విజయాలు లేని కృతి శెట్టికి ఉన్నట్లుండి ఆఫర్స్ క్యూ కట్టడం వెనక అసలు కారణమేంటి..? శ్రీలీల రీసెంట్ ఫెయిల్యూర్స్ ఈమెకు హెల్ప్ అవుతున్నాయా లేదంటే మిగిలిన భాషల్లో కృతి శెట్టిని కొత్తగా ఫీల్ అవుతున్నారా..?

ఈ రెండూ కాదంటే గ్లామర్ డోర్స్ ఓపెన్ చేయడం ఉప్పెన బ్యూటీకి కలిసొస్తుందా..? టైటిల్‌కు తగ్గట్లే ఉప్పెనలా ఇండస్ట్రీకి దూసుకొచ్చిన బ్యూటీ కృతి శెట్టి.

ఏం జరిగిందో తెలుసుకుని తేరుకునేలోపే ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజుతో దెబ్బకు గోల్డెన్ లెగ్ అయిపోయింది ఈ బ్యూటీ. నీ అంతలోనే టైమ్ టర్న్ అయింది.

వరసగా ఫ్లాపులొచ్చాయి. మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ ఫ్లాపులతో కృతి శెట్టి రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది.

ఈమె చేతిలో ప్రస్తుతం శర్వానంద్, శ్రీరామ్ ఆదిత్య సినిమా తప్ప మరో ప్రాజెక్ట్ లేదు. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది శర్వా 35.

ఇక మలయాళంలో అజయంతే రాండాం మోషనం సినిమాలో నటిస్తున్నారు. దీని బడ్జెట్ దాదాపు 90 కోట్లు. ఇదిలా ఉంటే ఆఫర్స్ కోసం గ్లామర్ డోస్ పెంచేసారు బేబమ్మ.

తాజాగా ఈమె చేసిన బెల్లీ డాన్స్ వీడియో వైరల్ అవుతుంది. మలయాళంతో పాటు తమిళంలో ఓ భారీ సినిమాలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. జయం రవి హీరోగా నటిస్తున్న జీనీలో కళ్యాణి ప్రియదర్శన్‌తో పాటు ఈమె మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఇది 100 కోట్ల బడ్జెట్‌తో రాబోతుంది. కార్తితోనూ వా వాతియారే సినిమాలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఈ మూడు సినిమాలు హిట్టైతే.. సౌత్‌లో కృతి జాతకం మారుతుంది. అలాగే గ్లామర్ డోర్స్ ఓపెన్ అయ్యాయ్ కాబట్టి అది కూడా కాస్త హెల్ప్ కానుంది.




