- Telugu News Photo Gallery Cinema photos WITT Summit 2024: Pushpa movie actor Allu Arjun Honoured With TV9 Networks Nakshatra Samman telugu movie news
TV9 WITT Summit 2024: అల్లు అర్జున్‌కు Tv9 నక్షత్ర సమ్మాన్ అవార్డ్.. స్పెషల్ మెసేజ్ షేర్ చేసిన బన్నీ..
పాన్ ఇండియా స్టార్ హీరో.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ను టీవీ9 నక్షత్ర సమ్మాన్ అవార్డుతో సత్కరించారు. తనకు ఈ అవార్డ్ అందించినందుకు సంతోషం వ్యక్తం చేశారు అల్లు అర్జున్. పుష్ప 2 షూటింగ్ కారణంగా తాను ఈ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనలేకపోయానని టీవీ9 నెట్‌వర్క్‌కు వీడియో సందేశం పంపారు బన్నీ. 'పుష్ప' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయాడు.
Updated on: Feb 25, 2024 | 9:03 PM

భారతదేశపు అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ Tv9 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'వాట్ ఇండియా థింక్స్ టుడే (What India Thinks Today)' రెండో ఎడిషన్ ఈ ఆదివారం (ఫిబ్రవరి 25)న అట్టహాసంగా ప్రారంభమయ్యింది. ఈ గ్లోబల్ సమ్మిట్‌లో మొదటి రోజు రాజకీయ, సినీ ప్రముఖులు, పలువురు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.

ఈ మెగా ఎన్‌క్లేవ్‌లో వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన పలువురు ప్రముఖులను టీవీ9 నెట్వర్క్ గ్రాండ్‌గా సత్కరించింది. 20 ఏళ్లకే బ్యాడ్మింటన్ ప్రపంచంలో తనదైన ముద్రవేసిన యువక్రీడాకారిణి అన్మోల్ ఖరాబ్, సినీ నటి రవీనా టాండన్‌ను టీవీ9 నక్షత్ర సమ్మాన్ పురస్కారంతో సత్కరించారు.

అలాగే పాన్ ఇండియా స్టార్ హీరో.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ను టీవీ9 నక్షత్ర సమ్మాన్ అవార్డుతో సత్కరించారు. తనకు ఈ అవార్డ్ అందించినందుకు సంతోషం వ్యక్తం చేశారు అల్లు అర్జున్. పుష్ప 2 షూటింగ్ కారణంగా తాను ఈ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనలేకపోయానని టీవీ9 నెట్‌వర్క్‌కు వీడియో సందేశం పంపారు బన్నీ.

'పుష్ప' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయాడు. అయితే టీవీ 9 నెట్‌వర్క్‌కి మరియు తన అభిమానులకు వీడియో సందేశం ద్వారా ధన్యవాదాలు తెలిపాడు. ఈ ఏడాది పుష్ప 2 సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

'వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్ 2024' మొదటి రోజు అన్ని సెషన్స్ ముగిశాయి. తొలిరోజు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, సినీ నటి రవీనా టాండన్, జీ20లో భారత క్రీడాకారిణి అమితాబ్ కాంత్, నటుడు కమ్ దర్శకుడు శేఖర్ కపూర్, సినీ నటి ఖుష్బూ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.




