- Telugu News Photo Gallery Cinema photos Will shah rukh khan jawan movie sequel be made by director atlee
జవాన్ సీక్వెల్ రెడీ అవుతున్నారు బాలీవుడ్ బాద్ షా.. అప్‌డేట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్
ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీల్లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఓ సినిమా హిట్ అయితే చాలు, అవకాశం ఉన్నా లేకున్నా ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఏదో ఒక రకంగా ఆ సక్సెస్ ఫార్ములాను కంటిన్యూ చేసేందుకు ట్రై చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు బాలీవుడ్ బాద్ షా. షారూక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ జవాన్. కింగ్ ఖాన్ డ్యూయల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా నార్త్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది.
Phani CH |
Updated on: Sep 20, 2023 | 2:10 PM

ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీల్లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఓ సినిమా హిట్ అయితే చాలు, అవకాశం ఉన్నా లేకున్నా ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఏదో ఒక రకంగా ఆ సక్సెస్ ఫార్ములాను కంటిన్యూ చేసేందుకు ట్రై చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు బాలీవుడ్ బాద్ షా.

షారూక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ జవాన్. కింగ్ ఖాన్ డ్యూయల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా నార్త్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే తొలి వారంలోనే 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది.

ఆల్రెడీ 700 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జవాన్ వెయ్యి కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఉన్న మూవీ టీమ్ ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేసింది. జవాన్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ఎనౌన్స్ చేశారు కెప్టెన్ అట్లీ.

తన సినిమాలన్నీ సీక్వెల్ చేసేందుకు వీలుగానే ఉంటాయన్న అట్లీ... ఇప్పటి వరకు అలాంటి ఆలోచన మాత్రం చేయలేదన్నారు. కానీ జవాన్ విషయంలో మాత్రం సీక్వెల్ గురించి ప్లానింగ్ జరుగుతుందని చెప్పారు. సరైన పాయింట్ దొరికతే వీలైనంత త్వరగా సీక్వెల్‌ను పట్టాలెక్కిస్తామని చెప్పారు.

షారూక్ కూడా జవాన్ క్యారెక్టర్‌తో బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే అట్లీ సీక్వెల్ ప్రపోజల్ పెడితే బాద్ షా నో చెప్పకపోవచ్చన్న టాకే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ అప్‌డేట్‌తో ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు.





























