Pooja Hegde: చీరకట్టులో బుట్టబొమ్మ.. అవకాశాలు లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం..
పూజా హెగ్డే కు ప్రస్తుతం బ్యాడ్ లక్ వెంటాడుతుంది. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తాకొడుతున్నాయి. స్టార్ హీరోయిన్ గా రాణించిన పూజా ఇప్పుడు సాలిడ్ ఆఫర్స్ లేక సతమతం అవుతోంది. టాలీవుడ్, కోలీవుడ్ తోపాటు బాలీవుడ్ లోను సినిమాలు చేసింది పూజా హెగ్డే. బాలీవుడ్ లో హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. కానీ ఆ సినిమాలు ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేక పోయాయి.