- Telugu News Photo Gallery Cinema photos Did Vijay Antony's daughter commits suicide due to depression
Vijay Antony: విజయ్ ఆంటోని కూతురు మరణానికి కారణం ఇదేనా..? అసలు విషయం ఏంటంటే
నటుడు విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎడిటర్ గా ఇప్పుడు నటుడిగా తన ప్రతిభను చాటుకుంటున్నారు విజయ్ ఆంటోని. తాజాగా ఆయన కూతురు మీరా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. విజయ్ ఆంటోని ఫాతిమాను పెళ్లి చేసుకున్నారు. వీరి కూతురు మీరా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దాంతో విజయ్ కుటుంబం విషాదంలో నిండిపోయింది. మీరా మృతికి డిప్రషన్ కారణమా అని తెలుస్తోంది.
Updated on: Sep 20, 2023 | 2:03 PM

నటుడు విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎడిటర్ గా ఇప్పుడు నటుడిగా తన ప్రతిభను చాటుకుంటున్నారు విజయ్ ఆంటోని. తాజాగా ఆయన కూతురు మీరా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

విజయ్ ఆంటోని ఫాతిమాను పెళ్లి చేసుకున్నారు. వీరి కూతురు మీరా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దాంతో విజయ్ కుటుంబం విషాదంలో నిండిపోయింది. మీరా మృతికి డిప్రషన్ కారణమా అని తెలుస్తోంది.

విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా విజయ్ ఆంటోని అంత్యక్రియలు పూర్తయ్యాయి. చెన్నై లోని కీల్పాకం క్రైస్తవ స్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. చిన్న వయసులోనే మీరా ఆత్మహత్య చేసుకోవడంతో సినీ ఇండస్టీ, విజయ్ కుటుంబం విషాదంలో నిండిపోయింది.

మీరా ఆత్మహత్య పై పోలీసుల విచారణ కొనసాగుతోంది.. మీరా సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. ఈ ఫోన్ ద్వారా కీలక విషయాలను గుర్తించారు పోలీసులు. చనిపోవడానికి ముందు మానసిక వైద్యుల అపాయింట్మెంట్ తీసుకుంది మీరా.

24, 29 తేదీల్లో అపాయింట్మెంట్ తీసుకుంది ఈలోపు ఆత్మహత్య చేసుకుంది. మానసిక ఒత్తిడికి కారణం ఏంటి.. తల్లిదండ్రులకు తెలుసా లేదా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. విజయ్ ఆంటోని కూతురు మరణంతో విజయ్ ఆంటోని కుంగిపోయారు. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు




