ANR Birth Anniversary: ఘనంగా అక్కినేని శతజయంతి వేడుక.. కదిలి వచ్చిన టాలీవుడ్
తెలుగు సినిమా గురించి చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు అక్కినేని నాగేశ్వరావు, ఎన్టీ రామారావు. నేడు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి. నాగేశ్వరరావు జయంతి వేడుకలను అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించారు కుటుంబసభ్యులు. ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహ ఆవిష్కారానికి టాలీవుడ్ కదిలి వచ్చింది. టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాగేశ్వరరావు విగ్రహానికి నివాళులు అర్పించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
