- Telugu News Photo Gallery Cinema photos Will Prabhas get back his lost image with Kalki 2898 AD after Adipurush Telugu Heroes Photos
prabhas-kalki: ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి 2898 AD తో తెచ్చుకుంటారా.?
కల్కిలో అశ్వత్థామ వీడియో చూసినప్పటి నుంచీ ఎవరి యాంగిల్‌లో వాళ్లు మాట్లాడుకుంటూనే ఉన్నారు. వారెవా.. ఇంత టెక్నాలజీని ఎప్పుడూ చూడలేదు.. టెక్నికల్‌గా మూవీ వేరే లెవల్‌లో ఉంటుంది అని అమితాబ్‌లాంటి స్టాల్‌వార్ట్స్ మెచ్చుకుంటున్నారు. అందులో అసలు మేకింగ్ ఏముంది? అని నార్త్ జనాలు కొందరు పెదవి విరవడాన్ని చూస్తున్నాం. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ కి అవన్నీ పట్టడం లేదు.
Updated on: Apr 23, 2024 | 7:48 PM

కల్కిలో అశ్వత్థామ వీడియో చూసినప్పటి నుంచీ ఎవరి యాంగిల్‌లో వాళ్లు మాట్లాడుకుంటూనే ఉన్నారు. వారెవా... ఇంత టెక్నాలజీని ఎప్పుడూ చూడలేదు.. టెక్నికల్‌గా మూవీ వేరే లెవల్‌లో ఉంటుంది అని అమితాబ్‌లాంటి స్టాల్‌వార్ట్స్ మెచ్చుకుంటున్నారు. అందులో అసలు మేకింగ్ ఏముంది? అని నార్త్ జనాలు కొందరు పెదవి విరవడాన్ని చూస్తున్నాం.

అయితే డార్లింగ్ ఫ్యాన్స్ కి అవన్నీ పట్టడం లేదు. తమకు కావాల్సిన కొత్త యాంగిల్‌ని వెతుక్కుంటూ సాధ్యాసాధ్యాల గురించి చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏంటది.? ప్రభాస్ కెరీర్‌లో మాయని మచ్చలా మిగిలిపోయింది ఆదిపురుష్.

శ్రీరామచంద్రమూర్తిగా ప్రభాస్ నటించిన ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో బాగా తడబడింది. ప్రజలందరికీ తెలిసిన రామకథను చక్కగా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు ఓమ్ రవుత్. ఇప్పుడు కల్కిలో అమితాబ్ కేరక్టర్ రివీల్ చేసిన ఈ టైమ్‌లో మరోసారి ఆదిపురుష్‌ని గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్.

రామకథతో ఫెయిల్ అయిన తమ అభిమాన హీరో కల్కితో గట్టెక్కాలని కోరుకుంటోంది రెబల్ సైన్యం. పౌరాణిక పాత్రలను అటెంప్ట్ చేయడం మామూలు విషయం కాదు. అందులోనూ భారతకాలం నుంచి మోడ్రన్ టైమ్ వరకు సాగే ఈ కథలో డార్లింగ్ రోల్‌ని నాగ్ అశ్విన్ ఎలా తీర్చిదిద్దారు.?

ఇందులో పురాణ పురుషుడిగా కనిపిస్తారా ప్రభాస్? ఇప్పుడు కల్కికి ఇదే స్ట్రాంగ్ యుఎస్‌పీ. యంగ్ రెబల్‌స్టార్‌ని పౌరాణిక పాత్రలో చూపించి మెప్పించాల్సిన బరువు బాధ్యతలన్నీ ఇప్పుడు నాగ్ అశ్విన్‌వే. ఎలాగైనా సరే, వెరీ ఫస్ట్ లుక్‌తోనో, కేరక్టర్ ఇంట్రడక్షన్ వీడియోతోనో జనాలను మెస్మరైజ్ చేయాల్సిందే.

ఆ టైమ్‌లో ఏమాత్రం తడబడినా, ఆ ఇంపాక్ట్ సినిమా మీద భీభత్సంగా ఉంటుందన్నది ఒప్పుకుని తీరాల్సిన విషయం. అందుకే ప్రతి ఫ్రేమ్‌ని భూతద్దంలో చూసుకుని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాల్సిన అలర్ట్ జోన్‌లో ఉన్నారు నాగ్ అశ్విన్.




