- Telugu News Photo Gallery Cinema photos Actress Manushi Chhillar prices sandeep reddy vanga heroines rashmika mandanna and kiara advani Telugu Heroines Photos
Rashmika vs Kiara Advani: సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
ఉన్నట్టుండి ట్రెండింగ్‌లోకి వచ్చేశారు రష్మిక అండ్ కియారా. వీరిద్దరి అప్‌కమింగ్ ప్రాజెక్టులు నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందుకోసం ఏమైనా ట్రెండ్ అవుతున్నారా? అని అనుకుంటున్నారా.? మీ గెస్ బాగానే ఉంది.! పుష్ప, గేమ్‌చేంజర్ పనుల్లోనే బిజీగానే ఉన్నారు ఇద్దరూ. అయినా.. ట్రెండ్ అవుతున్నది మరో రీజన్‌తో.. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన యానిమల్ సినిమాకు సంబంధించి ఇంకా అప్లాజ్ అందుకుంటూనే ఉన్నారు నటి రష్మిక మందన్న.
Updated on: Apr 23, 2024 | 8:18 PM

ఉన్నట్టుండి ట్రెండింగ్‌లోకి వచ్చేశారు రష్మిక అండ్ కియారా. వీరిద్దరి అప్‌కమింగ్ ప్రాజెక్టులు నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందుకోసం ఏమైనా ట్రెండ్ అవుతున్నారా? అని అనుకుంటున్నారా.?

మీ గెస్ బాగానే ఉంది.! పుష్ప, గేమ్‌చేంజర్ పనుల్లోనే బిజీగానే ఉన్నారు ఇద్దరూ. అయినా.. ట్రెండ్ అవుతున్నది మరో రీజన్‌తో.. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన యానిమల్ సినిమాకు సంబంధించి ఇంకా అప్లాజ్ అందుకుంటూనే ఉన్నారు నటి రష్మిక మందన్న.

యానిమల్‌లో ఆమె చేసిన గీతాంజలి కేరక్టర్ అద్భుతం అంటూ మెచ్చుకుంటున్నారు జనాలు. అందరూ ప్రశంసించడం వేరు.. సాటి హీరోయిన్ పొగడటం వేరు కదా.. 'యానిమల్‌లో రష్మిక చాలెంజింగ్ రోల్ చేశారు..

అలాంటి కేరక్టర్‌లో చేయాలని నాకనిపిస్తోంది' అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు ఆపరేషన్ వేలంటైన్ ఫేమ్ మానుషి చిల్లర్. మానుషి చిల్లర్ ని సందీప్ రెడ్డి వంగా ఆల్రెడీ అప్రోచ్ అయ్యారట. అయితే అది యానిమల్ మూవీ కోసం కాదు.

అంతకన్నా ముందు.. ప్రీతీ కేరక్టర్ కోసం వెళ్లి కలిశారట.. తెలుగులో సెన్సేషనల్ మూవీగా పేరు తెచ్చుకున్న అర్జున్‌రెడ్డిని బాలీవుడ్‌లో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించారు సందీప్.

అయితే కబీర్‌సింగ్‌లో హీరో షాహిద్ అని తెలియక ఆ కేరక్టర్‌ని రిజక్ట్ చేశారట మానుషి చిల్లర్. కరెక్ట్ గా ఆ టైమ్‌లోనే ఆమె మిస్ వరల్డ్ అందుకున్నారట. దాంతో ఒన్ ఇయర్ ఆ టీమ్‌తో కాంట్రాక్ట్ లో ఉన్నానని చెప్పారు మానుషి.

సందీప్ కెప్టెన్సీలో కబీర్‌సింగ్‌లో పోగొట్టుకున్న ఛాన్స్ ని ఎప్పటికైనా అందుకోవాలన్నదే ప్రస్తుతానికి తన గోల్ అని అంటున్నారు ఈ బ్యూటీ.





























