బాలనటిగా కెరీర్ ఆరంభించి ఇప్పుడు హీరోయిన్గా రాణిస్తుంది కావ్య కళ్యాణ్ రామ్. అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన గంగోత్రి సినిమాతో చైల్డ్ యాక్టర్ గా నటించిన కావ్య.. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో బాలనటిగా కనిపించింది. మసూద సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన కావ్య.. ఫస్ట్ మూవీతోనే హీరోయిన్గా మెప్పించింది. ఆ తర్వాత బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.