First Looks: కొత్త కాలెండర్ వస్తే కొత్త లుక్స్, టీజర్స్ రావాలిగా..! న్యూ ఇయర్ కి వచ్చిన ఆ కొత్త పోస్టర్స్ ఏంటి..?
కొత్త కాలెండర్ వచ్చినపుడు కొత్త లుక్స్, టీజర్స్ కూడా రావాలిగా..! అది ఆనవాయితీ అంతే.. అందుకే దాన్ని తూచా తప్పకుండా పాటించారు దర్శక నిర్మాతలు. జనవరి ఫస్ట్ ఇలా వచ్చిందో లేదో అంతా ఒకేసారి తమ సినిమాల లుక్స్‌తో పాటు అప్‌డేట్స్ కూడా ఇచ్చారు. మరి న్యూ ఇయర్ వచ్చిన ఆ కొత్త పోస్టర్స్ ఏంటి..? అందులో ఏది ఎలా ఉందో చూద్దాం.. చూస్తున్నారుగా.. కొత్త ఏడాది వచ్చిన కొత్త కొత్త పోస్టర్స్ అన్నీ..! ఒక్కరో ఇద్దరో కాదు.. దాదాపు డజన్ మంది తమ సినిమాల లుక్స్ విడుదల చేసారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Jan 08, 2024 | 3:51 PM

చూస్తున్నారుగా.. కొత్త ఏడాది వచ్చిన కొత్త కొత్త పోస్టర్స్ అన్నీ..! ఒక్కరో ఇద్దరో కాదు.. దాదాపు డజన్ మంది తమ సినిమాల లుక్స్ విడుదల చేసారు. మహేష్ బాబు గుంటూరు కారం నుంచి మొదలుపెట్టి సంక్రాంతి సినిమాల్లో సైంధవ్, నా సామిరంగా కూడా కొత్త పోస్టర్స్ విడుదల చేసారు. అందులో వెంకీ సినిమా ట్రైలర్ జనవరి 3న విడుదలైంది. సినిమా జనవరి 13న విడుదల కానుంది.

న్యూ ఇయర్ సందర్భంగా వచ్చిన పోస్టర్స్‌లో దేవర కూడా ఒకటి. సముద్రాన్ని ఏలడానికి వచ్చేస్తున్న దేవరలా కనిపిస్తున్నారు ఎన్టీఆర్. ఈ చిత్ర టీజర్‌ను జనవరి 8న విడుదల చేయబోతున్నారు.

అలాగే గోపీచంద్ భీమా లుక్ విడుదల చేసారు. కన్నడ దర్శకుడు హర్ష ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో పాటు VS10 పోస్టర్స్ సైతం రిలీజ్ చేసారు మేకర్స్.

న్యూ ఇయర్ పోస్టర్స్‌లో టిల్లు స్వ్వేర్ లుక్ అదిరిపోయింది. అనుపమను ఒళ్లో కూర్చోబెట్టుకుని సిద్ధూ ఇచ్చిన పోజ్ మతులు చెడగొడుతుంది. ఇక విజయ్ కొత్త సినిమాకు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు.

విశాల్, హరి కాంబినేషన్‌లో వస్తున్న రత్నం నుంచి టైటిల్ సాంగ్ కూడా న్యూ ఇయర్ కానుకగా విడుదలైంది. దాంతో పాటు నిఖిల్ ది ఇండియా హౌజ్ మేకింగ్ వీడియోను విడుదల చేసారు మేకర్స్.





























