- Telugu News Photo Gallery Cinema photos Heroine Rashmika Mandanna Best Opening in Bollywood With Animal Movie Telugu Actress Photos
Rashmika Mandanna: కెరీర్‌లో గ్యాప్ తీసుకుంటున్నారా.? క్లారిటీ ఇచ్చిన నేషనల్ క్రష్.
అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయని అసలు అర్థం కాదు. దేని కోసం పరుగులాటో తెలియదు. కానీ అంతా జరుగుతున్న క్రమంలో ఎక్కడో ఒక్క క్షణం ఏం జరుగుతుందో చెప్పేవాళ్లుండాలి. పరుగు ఆపడం ఓ కళ. మంచి స్పీడ్ మీదున్నప్పుడు, కాస్త ఆగు.. కాస్త ఏం జరుగుతుందో ఆలోచించు.. ఎంత దూరం వచ్చావో గమనించు అని చెప్పేవాళ్లు చాలా ముఖ్యం. అలాంటి వాళ్లు తనతో ఉన్నారనే అంటున్నారు రష్మిక. ఇంతకీ ఎవరు వారు.? ఇది కదా నేను కన్న కల అని అంటున్నారు రష్మిక.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Jan 08, 2024 | 4:46 PM

అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయని అసలు అర్థం కాదు. దేని కోసం పరుగులాటో తెలియదు. కానీ అంతా జరుగుతున్న క్రమంలో ఎక్కడో ఒక్క క్షణం ఏం జరుగుతుందో చెప్పేవాళ్లుండాలి. పరుగు ఆపడం ఓ కళ.

మంచి స్పీడ్ మీదున్నప్పుడు, కాస్త ఆగు.. కాస్త ఏం జరుగుతుందో ఆలోచించు.. ఎంత దూరం వచ్చావో గమనించు అని చెప్పేవాళ్లు చాలా ముఖ్యం. అలాంటి వాళ్లు తనతో ఉన్నారనే అంటున్నారు రష్మిక. ఇంతకీ ఎవరు వారు.? ఇది కదా నేను కన్న కల అని అంటున్నారు రష్మిక.

ఎన్నాళ్లో వేచిన ఉదయం ఎదురైనప్పుడు దాన్ని ఆస్వాదించడానికి కూడా మనసుండాలి. ఆస్వాదించమని చెప్పే మనుషులు మనతో ఉండాలని అంటున్నారు నేషనల్ క్రష్.

చిన్న ట్రావెల్ బ్యాగ్‌తో నింగివైపు చూస్తూ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న పిక్, పోస్ట్ అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్నాయి. కొన్నిసార్లు జస్ట్ ఒక పాజ్ తీసుకుని ఆలోచించాలి అంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు రష్మిక.

కెరీర్‌లో గ్యాప్ తీసుకుంటున్నారా? అనే అనుమానాలను వ్యక్తం చేసిన వారు కొందరైతే, అబ్బే అలాంటిదేమీ లేదు.. జస్ట్ ఇయర్ ఎండ్ మూడ్.. హాలీడే వైబ్స్ అంటూ క్లారిటీ ఇచ్చేస్తున్నారు మరికొందరు.

తన జీవితంలో తాను ఎంచుకున్న మార్గం, ఎదిగిన తీరు తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నది రష్మిక మనసులో మాట. అసలు తానెంత దూరం ట్రావెల్ చేశానో కూడా ఎప్పుడూ అనుకోలేదట.

కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటుంటే, ఎదిగిన భావం కలుగుతుందని అంటున్నారు ఈ బ్యూటీ. 2023ని వారసుడు మూవీతో పాజిటివ్‌గా స్టార్ట్ చేశారు మేడమ్ రష్మిక. డిసెంబర్ 1న యానిమల్‌తో అంతే గొప్పగా ఎండ్ చేశారు.

బాలీవుడ్‌లో బంపర్ హిట్ చూడాలన్నది నేషనల్ క్రష్‌కి ఎన్నాళ్లుగానో ఉన్న కల. దానికోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నం ఫలించింది. ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారంటూ హ్యాపీగా చెబుతోంది రష్మిక టీమ్.





























