- Telugu News Photo Gallery Cinema photos What are the movies that will hit the theaters in the last week of January?
Film Releases: జనవరి చివరి వారంలో థియేటర్లలో చిన్న సినిమాల సందడి.. అవి ఏంటి.?
ప్రతివారం థియేటర్లలో కొన్ని సినిమాలు సందడి చేస్తాయి. అలాగే జనవరి చివరి వారంలో కూడా కొన్ని సినిమాలు విడుదల అవుతున్నయి. వాటిలో 13 ఏళ్ళ క్రితం రావాల్సిన ఓ సినిమా కూడా ఇప్పుడు విడదల అవుతుంది. మరి ఆ సినిమాలు ఏంటి.? నటీనటులు ఎవరు.? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.? ఎలాంటి విషయాలు ఈరోజు తెల్సుకుందాం..
Updated on: Jan 28, 2025 | 6:49 PM

Madha Gaja Raja Movie Review

ఫిబ్రవరి 2012 అనౌన్స్ అయినా ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. దాదాపు 13 ఏళ్ళ తర్వాత సంక్రాంతికి తమిళ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తెలుగు విడుదలకి సిద్ధమైంది.

జయ్ శంకర్, వరుణ్ సందేశ్, అప్సరా రాణి ప్రధాన పాత్రల్లో సురేష్ లంకలపల్లి, ఈశ్వర్ వాసె దర్శకత్వంలో రూపొందిన సినిమా రాచరికం ఈ తెలుగు యాక్షన్ డ్రామా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

జనవరి 31న విడుదలకు సిద్దమైన మరో తెలుగు సినిమా ‘మహిష’. కె.వి.ప్రవీణ్, యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి, మౌనిక ఇందులో ప్రధాన పాత్రధారులు. కె.వి.ప్రవీణ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.

షాహిద్ కపూర్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘దేవా’. రోషన్ ఆండ్రూస్ ఈ చిత్రానికి దర్శకుడు. జీ స్టూడియోస్, రాయ్ కపూర్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 31లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.




