- Telugu News Photo Gallery Cinema photos Web Series in OTT taking inspiration from Foreign films Telugu Entertainment Photos
OTT Films: డిజిటల్‌లో ఫారిన్ కంటెంట్ హవా..! యాక్షన్ తో పాటు బోల్డ్ కూడా..
సిల్వర్ స్క్రీన్ మీదే కాదు డిజిటల్‌లోనూ రీమేక్ ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. కోవిడ్ టైమ్‌లో ఇంటర్నేషనల్ కంటెంట్‌కు ఎక్స్‌పోజ్ అయిన ఆడియన్స్.. ఆ రేంజ్ షోస్ మన దగ్గర కూడా కావాలంటున్నారు. అందుకే మన మేకర్స్ ఫారిన్ కథలను మన కల్చర్‌కు తగ్గట్టుగా మార్చి రీమేక్ చేస్తున్నారు.ప్రజెంట్ సినిమాలకు పోటీగా వెబ్ సిరీస్‌లు కూడా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్ మీద చెప్పేందుకు వీలుకానీ కథలను..
Updated on: Sep 21, 2023 | 1:11 PM

సిల్వర్ స్క్రీన్ మీదే కాదు డిజిటల్‌లోనూ రీమేక్ ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. కోవిడ్ టైమ్‌లో ఇంటర్నేషనల్ కంటెంట్‌కు ఎక్స్‌పోజ్ అయిన ఆడియన్స్.. ఆ రేంజ్ షోస్ మన దగ్గర కూడా కావాలంటున్నారు. అందుకే మన మేకర్స్ ఫారిన్ కథలను మన కల్చర్‌కు తగ్గట్టుగా మార్చి రీమేక్ చేస్తున్నారు.

ప్రజెంట్ సినిమాలకు పోటీగా వెబ్ సిరీస్‌లు కూడా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్ మీద చెప్పేందుకు వీలుకానీ కథలను.. ఓటీటీలో కాస్త సుధీర్ఘంగా చెప్పేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. ఈ ట్రెండ్ రీజినల్ లాంగ్వేజెస్‌లోనూ గట్టిగానే కనిపిస్తోంది. అందుకే వెస్ట్రన్ కాన్సెప్ట్స్‌ను ఇష్టపడే వారి కోసం అక్కడి కథలతోనే మన ఆడియన్స్‌కు తగ్గట్టుగా డిజైన్ చేస్తున్నారు.

టాలీవుడ్ సీనియర్ స్టార్ వెంకటేష్, యంగ్ హీరో రానా లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానా నాయిడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ షో అమెరికన్ క్రైమ్ డ్రామా 'రే డొనవన్'కు రీమేక్. 2013లో మొదలైన రే డొనవన్ ఏడు సీజన్లుగా రిలీజ్ అయ్యింది. మరి ఇండియాలో రెండో సీజన్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ షోను.. ఇంకెన్నీ సీజన్లుగా ప్లాన్ చేస్తారో చూడాలి.

ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్, శోభితా ధూళిపాల లీడ్ రోల్స్‌లో నటించిన క్రైమ్ డ్రామా ది నైట్ మేనేజర్. అదే పేరుతో తెరకెక్కిన అమెరికన్ వెబ్ సిరీస్‌కు రీమేక్‌గా ఈ షోను రూపొందించారు. ఆల్రెడీ ఈ షో రెండు సీజన్లు ఆడియన్స్ ముందుకు వచ్చాయి.

ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో నేషనల్ లెవల్‌లో పేరు తెచ్చుకున్న సమంత మరో వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా సిటాడెల్‌కు ఇండియన్ వర్షన్‌ను అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ షో మీద భారీ అంచనాలు ఉన్నాయి.

అజయ్ దేవగన్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్. ఈ షోను బ్రిటీష్ సైకలాజికల్ థ్రిల్లర్ లూథర్ ఆధారంగా తెరకెక్కించారు. ఫారిన్‌లో సూపర్ హిట్ అయిన ఈ షోకు ఇండియన్ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్సాన్స్ వచ్చింది.

డచ్‌లో సూపర్ హిట్ అయిన డ్రామా సిరీస్ పెనోజా. ఇదే షోను ఇండియాలో ఆర్య పేరుతో రీమేక్ చేశారు. సుస్మితా సేన్ లీడ్ రోల్‌లో తెరెకెక్కిన ఈ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.





























