- Telugu News Photo Gallery Cinema photos Star hero Kamal Haasan two movies ready to re release in Tollywood Telugu Entertainment Photos
Kamal Haasan: రీ రిలీజ్‌కు కమల్ మూవీస్.! ఒకటి కాదు డబల్ బొనాంజా..
ప్రజెంట్ సౌత్ సర్కిల్స్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలను ఆ హీరోల బర్త్ డేస్ సందర్భంగానో, మరేదైన అకేషన్ చూసుకొని రీ రిలీజ్ చేస్తున్నారు. కానీ ఈ ట్రెండ్‌ను తన అప్ కమింగ్ సినిమాల ప్రమోషన్ కోసం వాడేస్తున్నారు యూనివర్సల్ స్టార్.విక్రమ్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన కమల్ హాసన్ అప్ కమింగ్ సినిమాల విషయంలో సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు.
Updated on: Sep 21, 2023 | 2:22 PM

ప్రజెంట్ సౌత్ సర్కిల్స్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలను ఆ హీరోల బర్త్ డేస్ సందర్భంగానో, మరేదైన అకేషన్ చూసుకొని రీ రిలీజ్ చేస్తున్నారు. కానీ ఈ ట్రెండ్‌ను తన అప్ కమింగ్ సినిమాల ప్రమోషన్ కోసం వాడేస్తున్నారు యూనివర్సల్ స్టార్.

విక్రమ్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన కమల్ హాసన్ అప్ కమింగ్ సినిమాల విషయంలో సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు. కథా కథనాలతో పాటు ప్రమోషన్ విషయంలోనూ ముందు నుంచే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

ప్రజెంట్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్న కమల్, ఆ సినిమా రిలీజ్‌కు భారీ స్కెచ్ రెడీ చేస్తున్నారు. ఇండియన్ సినిమాకు వచ్చిన హైప్‌ను సీక్వెల్ విషయంలో క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇండియన్ 2 రిలీజ్‌కు ముందు తొలి భాగాన్ని రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇండియన్ 2 తరువాత మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు కమల్. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన ఎనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. మూడు దశాబ్దాల తరువాత ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఆ హైప్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లే స్కెచ్ రెడీ చేశారు యూనివర్సల్ స్టార్. మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన నాయకుడు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్టుగా ఎనౌన్స్ చేశారు.

కమల్ హాసన్ బర్త్ డే వీక్‌లో నాయకుడు సినిమా రీ మాస్టర్ వర్షన్‌ను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్‌లతో అప్ కమింగ్ సినిమాల మీద హైప్ భారీగా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.




