Film Updates: విశ్వక్ కి డార్లింగ్‌ ఫ్యాన్స్ థాంక్స్! శ్రీలీల తప్పు చేస్తుందా.?

హాయ్‌, హలో అంటూ స్పెషల్‌ వీడియోలో ప్రభాస్‌ పలకరింపులు విన్నవారందరూ విశ్వక్ సేన్‌కి థాంక్స్ చెబుతున్నారు. రకుల్‌ అనగానే అందరికీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అనే విషయం గుర్తుకొస్తుంది. అయితే రకుల్‌ ప్రీత్‌సింగ్‌కి భక్తి కూడా ఎక్కువే. కెరీర్‌ పీక్స్ లో ఉన్నప్పుడు బ్రేక్‌ తీసుకోవడమేంటి? అని చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతలా ఫ్యాన్స్ ఫీలవుతుంటే, శ్రీలీల చెవిలో విషయం పడుతున్నట్టా? లేనట్టా?

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Prudvi Battula

Updated on: Mar 02, 2024 | 1:59 PM

హాయ్‌, హలో అంటూ స్పెషల్‌ వీడియోలో ప్రభాస్‌ పలకరింపులు విన్నవారందరూ విశ్వక్ సేన్‌కి థాంక్స్ చెబుతున్నారు. విశ్వక్ సేన్‌ హీరోగా నటించిన సినిమా గామి. ఈ సినిమా ట్రైలర్‌ బావుందంటూ ప్రభాస్‌ వీడియో రిలీజ్‌ చేశారు. సినిమా వార్తలతో ఎప్పుడూ ట్రెండ్‌లోనే ఉంటారు ప్రభాస్‌. అయితే ఆయన ఇప్పుడెలా ఉన్నారో చూడాలని రోజురోజుకీ ఫ్యాన్స్ కి కుతూహలం పెరుగుతూ ఉంటుంది.

1 / 5
ఎన్ని ఫొటోలు రిలీజ్‌ అయినా, అభిమాన హీరో వీడియోలో మాట్లాడుతుంటే ఆ థ్రిల్లే వేరబ్బా అంటారు ఫ్యాన్స్. ప్రభాస్‌ మాటలను వినాలనుకున్న రెబల్‌ ఆర్మీ కోరిక ఇప్పుడు ఇలా తీరింది. పనిలో పనిగా విశ్వక్సేన్‌ గామికి విషెస్‌ చెబుతున్నారు ఫ్యాన్స్. డార్లింగ్‌ తన సినిమా గురించి అంత బాగా మాట్లాడినందుకు విశ్వక్సేన్‌ కూడా ఫుల్‌ ఖుషీగా ఉన్నారు.

2 / 5
రకుల్‌ అనగానే అందరికీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అనే విషయం గుర్తుకొస్తుంది. అయితే రకుల్‌ ప్రీత్‌సింగ్‌కి భక్తి కూడా ఎక్కువే. సమయం దొరికినప్పుడల్లా అమృత్‌సర్‌ గోల్డెన్‌ టెంపుల్‌కి ఫ్యామిలీతో వెళ్తుంటారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఇటీవల పెళ్లి చేసుకుని భగ్నాని ఇంటి కోడలైన రకుల్‌ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. భర్త జాకీ భగ్నానితో కలిసి అమృత్‌సర్‌ గోల్డెన్‌ టెంపుల్‌కి వెళ్లారు. పసుపు రంగు దుస్తుల్లో, కొత్త పెళ్లికూతురిగా రకుల్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. పెళ్లి తర్వాత కూడా నటిస్తానని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు రకుల్‌. తమ ప్రేమ మొదలైన గోవాలోనే రకుల్‌, జాకీ ఒక్కటయ్యారు.

3 / 5
సంక్రాంతికి మహేష్ తో కలిసి గుంటూరు కారం చేశారు శ్రీలీల. సెట్స్ మీద పవన్‌ సినిమా ఒక్కటి మాత్రం రిలీజ్‌కి రెడీగా ఉంది. అంతే.. ఆ తర్వాత ఏంటి? అంటే చెప్పడానికి సినిమాల్లేవు. కొన్నాళ్లు కావాలనే గ్యాప్‌ తీసుకున్నారా? అలా వచ్చిందా? అంటే దానికీ సమాధానం లేదు. కాకపోతే, రీసెంట్‌గా తిరుపతికి వెళ్లినప్పుడు మాత్రం కొన్ని తెలుగు, తమిళ సినిమాలున్నాయని అనౌన్స్ చేశారు శ్రీలీల.

4 / 5
వాటి గురించి తాను చెప్పలేనని, ప్రొడక్షన్‌ హౌస్‌లు చెబుతాయనీ అన్నారు. గతేడాది వరుసగా సినిమాలకు సైన్‌ చేసిన శ్రీలీలకు, హిట్స్ ఎన్ని వచ్చాయో, ఫ్లాప్‌లు కూడా అన్నే వచ్చాయి. అందుకే కాస్త ఆలోచించి, నిదానంగా కథలు విని, ప్రాజెక్టులు సైన్‌ చేయాలనుకుంటున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. అసలు విషయం ఏంటన్నది శ్రీలీలే చెప్పాలి మరి.

5 / 5
Follow us