- Telugu News Photo Gallery Cinema photos Taapsee Pannu to Sai Pallavi latest movie news about heroines in Tollywood Industry
Heroines: పెళ్లి కూతురు కానున్న తాప్సీ? నాన్న కాళ్లు పడుతుంటారు! సాయిపల్లవి
తాప్సీ పెళ్లి గురించి నెట్టింట్లో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సమ్మర్‌లో ఉదయ్‌పూర్‌లో తాప్సీ... మిస్ నుంచి మిసెస్‌గా ప్రమోషన్ తీసుకోబోతున్నారు. నీహారిక కొణిదెల చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జీవితంలో తను ముందడుగు వేయడానికి సాయం చేసిన వారి గురించి మాట్లాడారు నీహారిక కొణిదెల. కన్నబిడ్డలు తల్లిదండ్రుల కాళ్లు పట్టడం మనకు అలవాటే. పేరెంట్స్ కూడా పిల్లల కాళ్లు పట్టడాన్ని గమనించే ఉంటాం. అయితే అది పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడు.
Updated on: Mar 02, 2024 | 1:45 PM

తాప్సీ పెళ్లి గురించి నెట్టింట్లో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సమ్మర్‌లో ఉదయ్‌పూర్‌లో తాప్సీ... మిస్ నుంచి మిసెస్‌గా ప్రమోషన్ తీసుకోబోతున్నారు. ఆమె చిరకాల మిత్రుడు మాథియాస్ బోతో ఆమె వివాహం జరగనుందన్నది సారాంశం. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి తాను ఇంతవరకూ ఎవరికీ క్లారిటీ ఇవ్వలేదని స్పందించారు తాప్సీ. దాంతో వార్తలకు చెక్ పడింది.

అయినా మాథియాస్ గురించి ఆరా తీస్తున్నారు జనాలు. మాథియాస్ డెన్మార్క్ కి చెందిన ప్రొఫెషనల్ బ్యాట్‌మింటన్ ప్లేయర్. 2015లో యూరోపియన్ గేమ్స్ లో గోల్డ్ సాధించారు. యూరోపియన్ ఛాంపియన్ షిప్‌ని రెండుసార్లు కైవసం చేసుకున్నారు. 2012 సమ్మర్ ఒలింపిక్స్ లో సిల్వర్ సాధించారు. 2020లో మాథియాస్ అక్కడ రిటైర్‌మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఇండియన్ నేషనల్ బ్యాట్‌మింటన్ టీమ్‌కి కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. తాప్సీకి, మాథియాస్‌కి పదేళ్ల అనుబంధం ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే.

నీహారిక కొణిదెల చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జీవితంలో తను ముందడుగు వేయడానికి సాయం చేసిన వారి గురించి మాట్లాడారు నీహారిక కొణిదెల. ఇటీవల సాగు ప్రెస్‌మీట్‌కి హాజరయ్యారు నీహారిక. ఎవరికైనా జీవితంలో ఎదురుదెబ్బలు తగులుతుంటాయని అన్నారు. కానీ ఎన్ని దెబ్బలు తగిలినా ఏమాత్రం కుంగిపోకుండా ముందడుగు వేయాలని సూచించారు. తన జీవితంలో తాను ఇబ్బంది పడ్డ ప్రతిసారీ కుటుంబసభ్యులు ధైర్యం ఇచ్చేవారని అన్నారు. స్నేహితులు అండగా నిలుచుని, సాయం చేసేవారని గుర్తుచేసుకున్నారు. ఏం జరిగినా ఫర్లేదు... మేం చూసుకుంటాం అనేవారు జీవితంలో ఉండటం గొప్ప విషయం అని అన్నారు నీహారిక.

కన్నబిడ్డలు తల్లిదండ్రుల కాళ్లు పట్టడం మనకు అలవాటే. పేరెంట్స్ కూడా పిల్లల కాళ్లు పట్టడాన్ని గమనించే ఉంటాం. అయితే అది పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడు. పెరిగి, పెద్దయ్యాక తల్లిదండ్రులు పిల్లల కాళ్లు పట్టడం మన దగ్గర పెద్దగా వినిపించని మాట. అయితే సాయిపల్లవికి మాత్రం ఇప్పటికీ వాళ్ల నాన్న కాళ్లు పడుతుంటారట. సిల్వర్‌స్క్రీన్ మీద సాయిపల్లవి చేసే డ్యాన్సులు వేరే లెవల్లో ఉంటాయి.

లేడీ ప్రభుదేవా అంటూ ఆమెకు కితాబిచ్చినవారు కూడా ఉన్నారు. శ్యామ్‌సింగరాయ్‌లో క్లాసికల్ డ్యాన్సులు చేసిన సమయంలో మాత్రమే సాయిపల్లవి పీరియడ్స్ లో లేరట. మిగిలిన అన్ని పాటలకు డ్యాన్సులు చేసేటప్పుడూ ఆమె పీరియడ్స్ లోనే ఉండేవారట. అదేంటో... ప్రతిసారీ అలాగే జరిగేదని గుర్తుచేసుకున్నారు పల్లవి. సెట్స్ లో వీర లెవల్లో స్టెప్పులు వేసిన తర్వాత ఇంటికెళ్తే టయర్డ్ గా అనిపించేదట. అప్పుడు వాళ్ల నాన్న కాళ్లు పట్టేవారట. ఆ విషయాలనే చెప్పారు సాయిపల్లవి.




