- Telugu News Photo Gallery Cinema photos Vijay Sethupathi to Ramcharan Couple latest films news cinema industry
Movie News: తప్పు మీలోనే ఉందేమో! విజయ్.. చెర్రీ లాంటి భర్తను కావాలంటున్న అమ్మాయిలు..
ఏదైనా ఒక విషయాన్ని మనసారా అనుకుంటే, వెంటనే నెరవేర్చడానికి భగవంతుడు రెడీగా ఉంటాడు. దాని మీద మనసు లగ్నం చేయాలి అని అంటున్నారు విజయ్ సేతుపతి. కొన్ని సినిమాలు ట్రెండ్ కావడానికి స్పెషల్ అకేషన్ అసలు అవసరం లేదు. ఏదో ఒక వార్తతో అలా ట్రెండ్ అయిపోతాయి అంతే... ఇప్పుడు బాలీవుడ్ రామాయణం అలాగే ట్రెండ్ అవుతోంది. రామ్‌చరణ్‌లాంటి భర్త కావాలని కోరుకుంటున్నారు అమ్మాయిలు. ఉన్నపళాన రామ్‌చరణ్ మీద అంత అటెన్షన్ ఎందుకు పెరిగిందని అనుకుంటున్నారా? రీజన్ ఉందండోయ్.
Updated on: Mar 03, 2024 | 1:17 PM

ఏదైనా ఒక విషయాన్ని మనసారా అనుకుంటే, వెంటనే నెరవేర్చడానికి భగవంతుడు రెడీగా ఉంటాడు. ఈ యూనివర్శ్ రెడీగా ఉంటుంది. దీనికి మనం చేయాల్సిందల్లా ఒకటే. మనకేం కావాలో స్పష్టంగా ఆలోచించుకోవాలి. దాని మీద మనసు లగ్నం చేయాలి అని అంటున్నారు విజయ్ సేతుపతి. ఆయన నటుడు కావాలని అదేపనిగా అనుకుంటూ ఉండేవారట.

అందుకే ఇవాళ ఈ పొజిషన్‌లో ఉన్నానని గర్వంగా చెబుతారు విజయ్ సేతుపతి. లక్ష్యం మీద దృష్టిని లగ్నం చేసినప్పుడే సగం పని పూర్తవుతుందని నమ్ముతారట మిస్టర్ సేతుపతి. ఒకవేళ అనుకున్న పని నెరవేరడం లేదని ఎవరైనా కంప్లయింట్ ఇస్తే, ఆ తప్పు వారిదేనని అంటున్నారు ఈ నటుడు. లక్ష్యం మీద గురి లేనప్పుడు అది నెరవేరడానికి ప్రకృతి సహకరించదని చెప్పారు.

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యష్ కీలక పాత్రల్లో నటిస్తున్న రామాయణం అనౌన్స్ మెంట్ ఈ శ్రీరామనవమికి వస్తుందన్నది లేటెస్ట్ న్యూస్. ఏప్రిల్ 17న కీలక పాత్రధారులకు సంబంధించిన విషయాలను వెల్లడించాలని మేకర్స్ అనుకుంటున్నట్టు... వార్తలు నార్త్ లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యష్... ముగ్గురూ ఇప్పుడు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాకే రామాయణం గురించి ఆలోచిస్తారు.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు భార్యతో కలిసి వెళ్లారు రామ్‌చరణ్. అందులో చెప్పుకోవడానికి ఏముంది? అని అంటారా? నిజానికి విషయం అది కాదు.... వాళ్ల జర్నీలో కనిపించిన దృశ్యాల గురించే విశేషంగా మాట్లాడుకుంటున్నారు జనాలు. స్పెషల్ ఫ్లైట్‌లో ఈ వేడుకకు హాజరయ్యారు చెర్రీ దంపతులు.

ఉపాసన కళ్లు మూసుకుని రెస్ట్ తీసుకుంటూ ఉండగా, ఆమె అరికాలు పడుతూ కనిపించారు చెర్రీ. బయట ఎంత పెద్ద స్టార్ అయినా, భార్య దగ్గర ఎలాంటి భేషజాలూ లేకుండా కనిపించిన చెర్రీ మీద మితిమీరిన అభిమానాన్ని పెంచుకుంటున్నారు జనాలు. ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు.




