- Telugu News Photo Gallery Cinema photos Update on Boyapati srinu upcoming project after skanda movie release Telugu Entertainment Photos
Boyapati srinu: స్కంద తరువాత బోయపాటి ప్లాన్ అదుర్స్..! ఆ ఇద్దరు హీరోస్ రిపీట్.
ప్రజెంట్ స్కంద ప్రమోషన్‌లో బిజీగా ఉన్న మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఆ తరువాత చేయబోయే సినిమాల విషయంలోనూ స్ట్రాంగ్ లైనప్ సెట్ చేస్తున్నారు. ఆల్రెడీ సూపర్ హిట్స్ ఇచ్చిన హీరోలను రిపీట్ చేయటంతో పాటు తన స్పాన్ పెంచుకునేందుకు బిగ్ స్కెచ్ రెడీ చేశారు.రామ్ హీరోగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్కంద. రామ్ హీరోగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్కంద.
Anil kumar poka | Edited By: Shaik Madar Saheb
Updated on: Sep 23, 2023 | 7:53 AM

ప్రజెంట్ స్కంద ప్రమోషన్‌లో బిజీగా ఉన్న మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఆ తరువాత చేయబోయే సినిమాల విషయంలోనూ స్ట్రాంగ్ లైనప్ సెట్ చేస్తున్నారు. ఆల్రెడీ సూపర్ హిట్స్ ఇచ్చిన హీరోలను రిపీట్ చేయటంతో పాటు తన స్పాన్ పెంచుకునేందుకు బిగ్ స్కెచ్ రెడీ చేశారు.

రామ్ హీరోగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్కంద. ప్రజెంట్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. కంటెంట్ పరంగా స్కంద ఇంట్రస్టింగ్‌గానే కనిపిస్తున్న బజ్ విషయంలో మాత్రం అనుకున్నంతగా సౌండ్ వినిపించటం లేదు.

స్కంద మీద ఎక్స్‌పెక్టేషన్స్ కన్నా... బోయపాటి నెక్ట్స్ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి.స్కంద సెట్స్ మీద ఉండగానే బాలయ్యతో మరో మూవీకి సంబంధించిన హింట్ ఇచ్చారు బోయపాటి. బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్‌ను అఫీషియల్‌గా కన్ఫార్మ్ చేశారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.

బాలయ్య సినిమా తరువాత మరో సూపర్ హిట్ కాంబోనూ రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు ఈ మాస్ యాక్షన్ డైరెక్టర్. అల్లు అర్జున్ హీరోగా సరైనోడు లాంటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన బోయపాటి, మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు.

తాజాగా ఈ స్టార్ డైరెక్టర్ లిస్ట్‌లోకి మరో హీరో ఎంట్రీ ఇచ్చారు. ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కోలీవుడ్ హీరో సూర్యతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు బోయపాటి.

ఆల్రెడీ ఇద్దరి మధ్య డిస్కషన్స్ కూడా జరిగాయన్న టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి డిస్కషన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా సెట్స్ మీదకు రావడానికి మాత్రం ఇంకా చాలా టైమ్ పడుతుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.





























