విద్యాధర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న గామిలో అఘోరాగా కనిపిస్తున్నారు విశ్వక్ సేన్. పీపుల్స్ ఫండింగ్‌తో వస్తుంది ఈ చిత్రం. ఎప్పట్నుంచో షూటింగ్ దశలోనే ఉన్న గామికి ఇన్నాళ్లకు మోక్షం వచ్చింది. మార్చ్ 8న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక విశ్వక్, బాలయ్య కంటే ముందు వెంకటేష్ కూడా నాగవల్లిలో అఘోరా మాదిరే కనిపించారు.