Tollywood: మిస్ శెట్టి దూకుడు.. హైట్రిక్ హీరో..! |సైమా వేదికపై ఎన్టీఆర్ ఎమోషనల్..

సైమాలో బెస్ట్ యాక్టర్‌గా అవార్డు అందుకున్నారు ఎన్టీఆర్. ఆ వేడుకల్లో అవార్డు తీసుకున్న తర్వాత తారక్ ఇచ్చిన స్పీచ్ వైరల్ అవుతుంది. తన అభిమానులని ఉద్దేశించి ఇచ్చిన ఈ స్పీచ్‌లో చాలా విషయాలు చెప్పుకొచ్చారు తారక్. తాను కష్టాల్లో ఉన్నపుడు, కింద పడినప్పుడు తనని పట్టుకొని పైకి లేపినందుకు.. తాను కన్నీటి చుక్క రాల్చినపుడు తాము ఏడ్చి, తాను నవ్వినవుడు తామూ నవ్విన అభిమాన సోదరులందరికీ నా పాదాభివందనాలు చేస్తున్నానని తెలిపారు ఎన్టీఆర్.

Anil kumar poka

|

Updated on: Sep 17, 2023 | 6:40 PM

ఖుషి సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహద్ తాజాగా నాని హాయ్ నాన్న సినిమాతో వచ్చేస్తున్నారు. చిత్రానికి కూడా ఆయన మంచి పాటలు ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ విడుదలైంది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.. శౌర్యు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డిసెంబర్ 21న హాయ్ నాన్న విడుదల కానుంది.

1 / 6
రామ్‍ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్కంద చిత్రంపై మంచి హైప్ ఉంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీలీల హీరోయిన్‍గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

2 / 6
సెప్టెంబర్ 28న విడుదల కానున్న సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. తాజాగా సినిమాలోని మాస్ పాట కల్ట్ మామాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. సెప్టెంబర్ 18న విడుదల కానుంది ఈ పాట.

3 / 6
సైమాలో బెస్ట్ యాక్టర్‌గా అవార్డు అందుకున్నారు ఎన్టీఆర్. ఆ వేడుకల్లో అవార్డు తీసుకున్న తర్వాత తారక్ ఇచ్చిన స్పీచ్ వైరల్ అవుతుంది. తన అభిమానులని ఉద్దేశించి ఇచ్చిన ఈ స్పీచ్‌లో చాలా విషయాలు చెప్పుకొచ్చారు తారక్. తాను కష్టాల్లో ఉన్నపుడు, కింద పడినప్పుడు తనని పట్టుకొని పైకి లేపినందుకు.. తాను కన్నీటి చుక్క రాల్చినపుడు తాము ఏడ్చి, తాను నవ్వినవుడు తామూ నవ్విన అభిమాన సోదరులందరికీ నా పాదాభివందనాలు చేస్తున్నానని తెలిపారు ఎన్టీఆర్.

సైమాలో బెస్ట్ యాక్టర్‌గా అవార్డు అందుకున్నారు ఎన్టీఆర్. ఆ వేడుకల్లో అవార్డు తీసుకున్న తర్వాత తారక్ ఇచ్చిన స్పీచ్ వైరల్ అవుతుంది. తన అభిమానులని ఉద్దేశించి ఇచ్చిన ఈ స్పీచ్‌లో చాలా విషయాలు చెప్పుకొచ్చారు తారక్. తాను కష్టాల్లో ఉన్నపుడు, కింద పడినప్పుడు తనని పట్టుకొని పైకి లేపినందుకు.. తాను కన్నీటి చుక్క రాల్చినపుడు తాము ఏడ్చి, తాను నవ్వినవుడు తామూ నవ్విన అభిమాన సోదరులందరికీ నా పాదాభివందనాలు చేస్తున్నానని తెలిపారు ఎన్టీఆర్.

4 / 6
సుధీర్ బాబు హీరోగా ‘అమృతం’ నటుడు, ప్రముఖ రచయిత హర్ష వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా మామా మశ్చీంద్ర. ఈ చిత్రంలో సుధీర్ బాబు ప్రయోగాత్మకంగా మూడు భిన్నమైన పాత్రలను చేసారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి అమ్మ పాటను విడుదల చేసారు. అడిగా అడిగా అంటూ సాగే ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

5 / 6
నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. గతవారం విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పటికీ దీనికి మంచి వసూళ్లే వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఓవర్సీస్‌లో దుమ్ము దులిపేస్తుంది మిస్ శెట్టి. అక్కడ ఇప్పటికే 1.4 మిలియన్ డాలర్స్ మార్క్ అందుకున్న ఈ చిత్రం.. ఫుల్ రన్‌లో 1.8 నుంచి 2 మిలియన్ డాలర్స్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

6 / 6
Follow us