నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. దీని మోషన్ పోస్టర్ తాజాగా విడుదలైంది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‍కు చెందిన ఎర్లీ మోషన్ టేల్స్, స్వప్న సినిమాస్ ఈ వెబ్ సిరీస్‍ను నిర్మిస్తున్నాయి. గోమతేశ్ ఉపాధ్యే దర్శకత్వం వహిస్తున్న ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.