- Telugu News Photo Gallery Cinema photos Tollywood Upcoming movies New Updates on 30 April 2024 Telugu Entertainment Photos
Entertainment: తమన్నా, రాశీఖన్నా బాక్ రెడీ.! | మరింత గ్రాండ్‌గా చిరు విశ్వంభర..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా విశ్వంభర. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం ఏకంగా 17 గ్రాండ్ సెట్స్ వేశారట మేకర్స్. సినిమా షూటింగ్‌ని జులైకి పూర్తి చేయాలన్నది యూనిట్ ప్లాన్. తన కెరీర్‌లో సక్సెస్ జస్ట్ అలా వచ్చేయలేదని అన్నారు నటి తాప్సీ. ఇప్పుడు ఒక్క క్షణం వెనక్కి తిరిగి చూసుకుంటే, కాసేపు తీరిగ్గా కూర్చుని రిలాక్స్ కావాలని అనిపిస్తోందని అన్నారు.
Updated on: Apr 30, 2024 | 2:59 PM

ఇప్పటికే ఫస్టాఫ్ అయిపోయింది.. సెకండాఫ్ షూట్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా త్రిష నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి జోడీ కడుతున్నారు.

సాయి ధరమ్ తేజ్, బ్రహ్మాజీ చేతుల మీదుగా గుట్టుచప్పుడు టీజర్ విడుదలైంది. బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌రావ్ హీరోగా నటిస్తున్న సినిమా గుట్టు చప్పుడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మా అబ్బాయి నటిస్తున్న మూడో సినిమా ఇది. గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ చేస్తున్నారని అన్నారు బ్రహ్మాజీ.

ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో విడుదల చేస్తున్న సినిమా బాక్. తమన్నా, రాశీఖన్నా, సుందర్ సి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. సినిమా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు అతిథులు. ట్రైలర్ బావుందని ప్రశంసలు కురిపించారు.

చిన్న సినిమాలైనా ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకుంటాయా అంటే అది కూడా జరగలేదు. నోటబుల్ మూవీ ఒక్కటి కూడా రిలీజ్ కాకపోవటంతో ఏకంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌ను మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది.

తన కెరీర్‌లో సక్సెస్ జస్ట్ అలా వచ్చేయలేదని అన్నారు నటి తాప్సీ. ఇప్పుడు ఒక్క క్షణం వెనక్కి తిరిగి చూసుకుంటే, కాసేపు తీరిగ్గా కూర్చుని రిలాక్స్ కావాలని అనిపిస్తోందని అన్నారు.

ఇప్పటిదాకా తాను పలు రకాల జోనర్లలో సినిమాలు చేశానని, అంత వైవిధ్యమున్న పాత్రలను ఎంపిక చేసుకోవడం చాలా కష్టమని అన్నారు తాప్సీ.




