Daya: జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య నంబీసీన్ ముఖ్య పాత్రల్లో నటించిన 'దయా' వెబ్ సిరీస్ ఈ నెల 4న ప్రముఖ ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. దీనికి సిరీస్ యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు వచ్చారు. ఇందులో ప్రతీ కారెక్టర్ యూనిక్‌గా ఉంటుందన్నారు మేకర్స్.