Telugu Movies: షూటింగ్స్ తో టాలీవుడ్ కళకళ.. ఏ హీరో ఎక్కడున్నారు.?

సంక్రాంతి హీరోలు ఇప్పట్లో షూటింగ్‌కు వచ్చేలా కనిపించడం లేదు. ఇక పద్మ విభూషణ్ సెలబ్రేషన్స్ నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వచ్చి.. షూటింగ్‌లో అడుగు పెట్టారు చిరంజీవి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారు. వీళ్లు మినహా.. మిగిలిన హీరోలంతా సెట్స్‌లోనే ఉన్నారు. మరి ఏ హీరో ఎక్కడున్నారు.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో స్పెషల్ ఈటీ షూటింగ్ అప్‌డేట్స్ స్టోరీలో చూసేద్దాం..

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: Feb 11, 2024 | 12:13 PM

సంక్రాంతికి వచ్చిన మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున, తేజ సజ్జా ఇంకొన్ని రోజుల వరకు షూటింగ్‌కు రానట్లే. ప్రభాస్ మాత్రం ప్రస్తుతం నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కేతో బిజీ అయ్యారు. కల్కి షూటింగ్ కొన్ని రోజులుగా శంకరపల్లిలోనే జరుగుతుంది.

1 / 5
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కితున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం దేవర షూటింగ్ అల్యూమీనియం ఫ్యాక్టరీలోనే రెండు వారాలుగా జరుగుతుంది. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్.

2 / 5
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ 4 వారాలుగా RFCలోనే జరుగుతుంది. రామ్ చరణ్, శంకర్ గేమ్ చేంజర్ షూటింగ్‌కు ఇంకొన్ని రోజులు బ్రేక్ తప్పేలా లేదు. చిరంజీవి చాలారోజుల తర్వాత సెట్‌కు వచ్చారు. వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభర సెట్స్‌లో ఆయన జాయిన్ అయ్యారు. త్రిష ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

3 / 5
నాని, వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారం షూటింగ్ ఓల్డ్ సిటీ నుంచి ఎర్రగడ్డకు షిఫ్ట్ అయింది. అలాగే దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది.

4 / 5
ఇక కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్ విజయవాడలో.. ధనుష్, శేఖర్ కమ్ముల సినిమా గోవాలో.. అడవి శేష్ గూడాఛారి 2 షూటింగ్ శంషాబాద్‌లో జరుగుతున్నాయి.

5 / 5
Follow us