- Telugu News Photo Gallery Cinema photos Fans are saying Mahesh Babu's look is awesome for Rajamouli's movie
Mahesh Babu: ఫుల్లీ లోడెడ్ గన్ అంటూ కాంప్లిమెంట్స్.. మహేష్ న్యూ లుక్ అదుర్స్..
రమణగాడు మాస్ మేనియా ఎలా ఉంటుందో ఫెస్టివ్ సీజన్‌లో సంక్రాంతికి టేస్ట్ చేసేశారు జనాలు. ఇంకో మూడేళ్ల దాకా బాబు సినిమా లేనట్టే...నని మానసికంగా ఫిక్సయిపోయారు సూపర్‌స్టార్ ఫ్యాన్స్. ఆ తర్వాత ఇంటర్నేషనల్ లెవల్లో జక్కన్న మోగించబోయే మోత గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో సందడిగా మాట్లాడుకుంటున్నారు అభిమానులు.
Updated on: Feb 11, 2024 | 11:48 AM

దమ్ మసాలా బిర్యానీని గుంటూరు కారంతో దట్టించి రుచి చూపించి వారెవా అనిపించారు సూపర్‌స్టార్ మహేష్ బాబు. తాజాగా ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ మొదలైంది. ఇందులో మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఆ మూవీ మెరుపులు మర్చిపోకముందే జక్కన్న సినిమా గురించి ఇంట్రస్టింగ్ బజ్ మొదలైంది. రాజమౌళి డైరక్టోరియల్ మూవీ కోసం ఇటీవల షార్ట్ టైమ్ ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకున్నారు సూపర్‌స్టార్. అందుకోసం జర్మనీకి వెళ్లొచ్చారు సిల్వర్‌స్క్రీన్ రమణ

ట్రిప్ నుంచి రిటర్న్ అయిన మహేష్ లుక్ అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్. లాంగ్ హెయిర్, మంచి బియర్డ్ తో అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నారంటూ, లుక్ అదిరిందంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఫుల్లీ లోడెడ్ గన్ ఈజ్ రెడీ అని మొదలుకాబోయే ప్రాజెక్ట్ కోసం ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు అభిమానులు.

ఇండియన్ సినిమాలోనే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇదే, ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందంటూ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ చెప్పిన మాటలు కూడా జనాలను ఊరిస్తున్నాయి.

హాలీవుడ్ రేంజ్‌లో పలువురు టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఈ సినిమాకు పనిచేస్తారనే టాక్ ఆల్రెడీ ఉంది. ఉగాది నుంచి ప్రాజెక్ట్ పనులు మరింత ఊపందుకుంటాయన్నది గట్టిగా వినిపిస్తున్నమాట.




