అర్ధరాత్రి ఓటీటీలోకి వచ్చేసిన జైలర్. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు 650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రేమ్ వీడియోలో సెప్టెంబర్ 7 నుంచి అందుబాటులోకి వచ్చేసింది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.