Tollywood News: ఎందులోనూ తగ్గేదేలే.. ఇండస్ట్రీని ఏలుతామంటున్న స్టార్ హీరోల కూతుళ్లు..
వారసత్వం అంటే కేవలం కొడుకులది మాత్రమే కాదు కూతుళ్లది కూడా..! కాకపోతే ఇండస్ట్రీలో వారసురాళ్ల కంటే వారసులే హైలైట్ అవుతుంటారు. అందుకే మాకేం తక్కువా.. మేమేం తక్కువా అంటూ డాటర్స్ ఇప్పుడు డైరెక్ట్ అటాక్‌కు దిగుతున్నారు. దానికోసం తమ తండ్రులను తెరమీదకి తీసుకొస్తున్నారు. హీరోలు సైతం కూతుళ్ల కోసం అలాగే కష్టపడుతున్నారు. ఇండస్ట్రీలో ఎంతసేపూ వారసులపైనే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. కానీ మన హీరోలకు కూతుళ్లు కూడా ఉన్నారు..
Updated on: Jul 13, 2024 | 10:15 AM

ఇటు శ్రుతిహాసన్ కూడా డెకాయిట్ లో డిష్యుమ్ డిష్యుమ్ అంటున్నారు. మాజీ ప్రేమికులిద్దరూ చేతుల్లో వెపన్స్ తో కనిపించే టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. ఆల్రెడీ క్రాక్‌లోనూ బిగ్ ఫైట్ చేశారు శ్రుతిహాసన్. వాల్తేరు వీరయ్యలోనూ ఆమె వెపన్స్ ని డీల్ చేశారు.

ఇండస్ట్రీలో ఎంతసేపూ వారసులపైనే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. కానీ మన హీరోలకు కూతుళ్లు కూడా ఉన్నారు.. వాళ్లు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు. కమల్ హాసన్ కూతుళ్లలో శృతి ఇప్పటికే స్టార్ కాగా.. అక్షర యాక్టింగ్‌తో పాటు డైరెక్షన్‌పై ఫోకస్ చేస్తున్నారు. ఇక రజినీకాంత్ తన కూతురు ఐశ్వర్య కోసం లాల్ సలామ్‌లో హీరోగా నటించారు. జైలర్ తర్వాత రజినీ నటించిన సినిమా ఇది.

రజినీ తన ఇద్దరు కూతుళ్ల కోసం తన ఇమేజ్ పణంగా పెట్టారు. అప్పట్లో కొచ్చాడయాన్ సినిమాను చిన్న కూతురు సౌందర్య తెరకెక్కించారు. ఇప్పుడు పెద్ద కూతురు కోసం లాల్ సలామ్ చేసారు. మరోవైపు చిరంజీవి సైతం తన కూతురు సుష్మితను కాస్ట్యూమ్ డిజైనర్‌గా ప్రతీ సినిమాకు కంటిన్యూ చేస్తున్నారు. మరోవైపు ఆమె బ్యానర్‌లో త్వరలోనే సినిమా చేసి.. కూతుర్ని నిర్మాతగా నిలబెట్టాలని చూస్తున్నారు మెగాస్టార్.

సుష్మిత ప్రొడక్షన్‌లో సినిమా చేయడానికి చిరు ఎప్పుడో ఓకే చెప్పారు. దానికి దర్శకుడు ఇంకా ఫైనల్ కాలేదు. ఆ మధ్య కళ్యాణ్ కృష్ణతో అనుకున్నా.. కథ సెట్ అవ్వలేదు. తాజాగా హరీష్ శంకర్ ఈ రేసులో ముందున్నారు. ఈయన చెప్పిన కథ నచ్చడంతో తండ్రి సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు మెగా డాటర్.

బాలయ్య కూడా చిరంజీవి దారిలోనే వెళ్తున్నారు. మిగిలిన వాళ్లతో పోలిస్తే బాలయ్య కూతుళ్లు ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. తాజాగా చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా మారుతున్నారు. కూతురు బ్యానర్‌లోనే అఖండ 2 చేస్తున్నారు NBK. ఇప్పటికే బోయపాటి సినిమా పోస్టర్‌పై తేజస్విని పేరు వచ్చేసింది. మొత్తానికి కూతుళ్ళ కోసం మన స్టార్స్ చేతనైన సాయం చేస్తున్నారు.




