- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroines likes Anushka Shetty, Trisha, Krithi Shetty interested do movies in malayalam
మలబారు తీరానికి క్యూ కడుతున్న నాయికలు..
మామూలుగా హీరోయిన్లు మాలీవుడ్ నుంచి మన దగ్గరకు ట్రావెల్ చేస్తుంటారు. బట్, ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు అన్నీ ఇండస్ట్రీల నుంచి కేరళకు ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ల మనసుకు నచ్చిన కథలు అక్కడ పలకరిస్తున్నాయా? లేకుంటే, ప్యాన్ ఇండియా ఎలివేషన్‌లో ఏ ఇండస్ట్రీ అయినా ఒకటే అనుకుంటున్నారా? వాళ్లని అటు వైపు నడిపిస్తున్న విషయాలేంటి? కమాన్ లెట్స్ వాచ్...
Updated on: Feb 12, 2025 | 8:33 PM

మన దగ్గర ఉప్పెనతో సూపర్ డూపర్ అనిపించుకున్న కృతి శెట్టి లాస్ట్ ఇయర్ టొవినో థామస్‌తో మలయాళం సినిమా చేశారు. ఆ సినిమా అక్కడ మంచి టాక్ తెచ్చుకుంది.

టొవినో హీరోగా నటించిన ఐడెంటిటీలో నటించి ది బెస్ట్ అనిపించుకున్నారు త్రిష కృష్ణన్. మన దగ్గర ఘాటీ చేస్తున్న అనుష్క, మలయాళంలో కథనార్‌లో నటిస్తున్నారు.

స్వీటీకి మలయాళంలో తొలి వెంచర్ ఇదే. ఈ సినిమా కోసం మలయాళం కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుష్క శెట్టి. ఈ ఏడాదే ఈ సినిమాను విడుదల చేయాలన్నది నిర్మాతల ప్లాన్.

మరోసారి మమ్ముట్టితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ఏ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా.. మలయాళ కథలను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయరు నయన్. నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది కేరళ ఇండస్ట్రీనే అని గర్వంగా చెప్పుకుంటారు లేడీ సూపర్‌స్టార్.