- Telugu News Photo Gallery Cinema photos Tollywood Heroine Kajal Agarwal Satyabhama Movie Release Date Update and Teaser Telugu Actress Photos
Kajal Agarwal: ‘క్వీన్ ఆఫ్ మాస్’ గా టాలీవుడ్ చందమామ.. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్.
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి.. సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు చూపిస్తోంది. ఇప్పుడు తన సినిమాల స్పీడ్ పెంచింది. పెళ్లయ్యాక సినిమాలు తగ్గిస్తుందని అందరూ అనుకున్నారు కానీ.. కాజల్ ఓ వైపు లేడి ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తూనే మరో వైపు కమర్షియల్ మూవీ కూడా చేస్తుంది. కాజల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో దూసుకుపోతోంది.
Updated on: Apr 24, 2024 | 10:44 AM

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి.. సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు చూపిస్తోంది. ఇప్పుడు తన సినిమాల స్పీడ్ పెంచింది.

పెళ్లయ్యాక సినిమాలు తగ్గిస్తుందని అందరూ అనుకున్నారు కానీ.. కాజల్ ఓ వైపు లేడి ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తూనే మరో వైపు కమర్షియల్ మూవీ కూడా చేస్తుంది.

కాజల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఆమె నటించిన 'సత్యభామ మూవీ' తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా మూవీ టీమ్ నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది . దానితో పాటే టీజర్ కూడా రిలీజైంది. ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.

'సత్యభామ' సినిమాలో కాజల్ అగర్వాల్ గతంలో కంటే భిన్నంగా కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇప్పుడు విడుదలైన టీజర్‌లో తుపాకీతో సందడి చేసింది.

సత్యభామ’ సినిమా విడుదల తేదీని టీజర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా మే 17న విడుదల కానుంది. కాజల్‌ని ‘క్వీన్ ఆఫ్ మాస్’ అని రాసుకొచ్చారు.

ఇది కాకుండా కాజల్ అగర్వాల్ ‘ఇండియన్ 2’ సినిమాలో కూడా నటించింది. ఈ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మొత్తానికి కాజల్ అభిమానులు ‘సత్యభామ’, ‘ఇండియన్ 2’ సినిమాల ద్వారా బ్యాక్ టు బ్యాక్ ఎంటర్ టైన్ మెంట్ పొందనున్నారు.





























