Nayanthara: సింపుల్‌గా కనిపిస్తుందని తక్కువ అంచనా వేయ్యోద్దు.. నయనతార రోలెక్స్ వాచ్ ధర తెలిస్తే షాకే..
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జవాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నయన్.. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో కలిసి సమయం గడుపుతుంది. ఇటీవలే కుటుంబంతో కలిసి వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. చెన్నైలో డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య శంకర్ వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించారు. తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి నయనతార లిలక్ షేడ్ చీరలో అందంగా కనిపించింది.