- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroes like allu arjun balakrishna nikhil wants make historical films
థింక్ డిఫరెంట్ అంటున్న టాలీవుడ్.. ఐకాన్ స్టార్ ది అదే రూట్
మీరు డిఫరెంట్‌గా థింక్ చేయండి.. ఆటో మేటిగ్గా ప్రాజెక్టుకు భారీ తనం వచ్చేస్తుందని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నట్టున్నారు టాలీవుడ్ మేకర్స్. ఎట్ ప్రెజెంట్ మైథాలజీ, హిస్టారికల్ సబ్జెక్టుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ రేసులో పార్టిసిపేట్ చేస్తున్న హీరోలెవరు? పుష్ప2 తర్వాత ఐకాన్ స్టార్ మీద ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఫోకస్ పెరిగింది.
Updated on: Feb 16, 2025 | 3:06 PM

పుష్ప2 తర్వాత ఐకాన్ స్టార్ మీద ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఫోకస్ పెరిగింది. దానికి ఇంచు కూడా తగ్గకుండా ఉండేలా నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్. మైథలాజికల్ సబ్జెక్టుతో ముందుకు సాగుతోందీ కాంబో.. ఆల్రెడీ నందమూరి బాలకృష్ణ ఇదే పని మీదున్నారు.

బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ తాండవం సినిమాలోనూ మైథలాజికల్ టచ్ ఉంటుందన్నది ముందు నుంచీ వింటున్న మాట. ప్రస్తుతం స్పీడందుకుందీ ప్రాజెక్ట్. అటు జై హనుమాన్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ.

లాస్ట్ ఇయర్ హనుమాన్‌తో సక్సెస్ అందుకున్నారు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు దానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. నార్త్ లో రణ్‌బీర్, సాయిపల్లవి జోడీగా రామాయణం సెట్స్ మీదుంది. మన దగ్గర పౌరాణికాలతోనే కాదు, చారిత్రక అంశాలతోనూ సబ్జెక్టులు రెడీ అవుతున్నాయి.

చోళుల నాటి కథతో స్వయంభు రూపొందుతోంది. నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. తేజ సజ్జా మిరాయ్ లోనూ చారిత్రక అంశాల ప్రస్తావన ఉంది.

తండేల్‌తో ప్రూవ్ చేసుకున్న నాగచైతన్య కూడా నెక్స్ట్ హిస్టారికల్ సబ్జెక్టులో కనిపించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన కోసం తెనాలి రామకృష్ణుడి కథను రెడీ చేస్తున్నారు చందు మొండేటి.




