- Telugu News Photo Gallery Cinema photos Tollywood Directors Wants balakrishna dates for further movies NBK 110 and NBK 111 Telugu Heroes Photos
Balakrishna: ఇండస్ట్రీలో బాలకృష్ణ హవా.. వి వాంట్ బాలయ్య అంటున్న తెలుగు డైరెక్టర్స్.
మిడాస్ టచ్‌లా ఇప్పుడు ఇండస్ట్రీలో బాలయ్య టచ్ నడుస్తుంది. ఆయనతో సినిమా చేస్తే చాలు దర్శకులకు హిట్స్ వచ్చేస్తున్నాయి. దాంతో బాలయ్యతో ప్రాజెక్ట్ కోసం దర్శకులు క్యూ కడుతున్నారు. కుర్రాళ్లు, సీనియర్లు అనే తేడానే లేదు.. అందరూ వి వాంట్ బాలయ్య అంటున్నారు. ఇప్పుడేమో ఏకంగా యూనివర్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు NBK. దీని పూర్తి డీటైల్సే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. ఆప్నా టైమ్ ఆయేగా అంటారు కదా.. బాలయ్యకు ఆ టైమే వచ్చిందపుడు.
Updated on: Nov 17, 2023 | 6:21 PM

మిడాస్ టచ్‌లా ఇప్పుడు ఇండస్ట్రీలో బాలయ్య టచ్ నడుస్తుంది. ఆయనతో సినిమా చేస్తే చాలు దర్శకులకు హిట్స్ వచ్చేస్తున్నాయి. దాంతో బాలయ్యతో ప్రాజెక్ట్ కోసం దర్శకులు క్యూ కడుతున్నారు. కుర్రాళ్లు, సీనియర్లు అనే తేడానే లేదు.. అందరూ వి వాంట్ బాలయ్య అంటున్నారు.

ఇప్పుడేమో ఏకంగా యూనివర్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు NBK. దీని పూర్తి డీటైల్సే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. ఆప్నా టైమ్ ఆయేగా అంటారు కదా.. బాలయ్యకు ఆ టైమే వచ్చిందపుడు.

ఈయన మార్కెట్ చూసి కుర్ర హీరోలు కుళ్లుకుంటున్నారు.. సీనియర్లు భయపడుతున్నారు. ఆ రేంజ్ దండయాత్ర చేస్తున్నారు NBK. మరోవైపు బాలయ్యతో సినిమా కోసం డైరెక్టర్స్ పోటీ పడుతున్నారు.

ముఖ్యంగా నేటి జనరేషన్ దర్శకులు బాలయ్య కోసం కథలు రాస్తున్నారు.. వచ్చే మూడేళ్ల వరకు NBK డైరీ ఫుల్ అయిపోయింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య..

జోరు ఇంకా పెంచేసారిప్పుడు. 100 కోట్ల మార్కెట్ ఉన్నా.. 20 నుంచి 25 కోట్ల మధ్యలోనే ఈయన పారితోషికం ఉండటంతో నిర్మాతలు కూడా బాలయ్య కోసం ఎగబడుతున్నారు.ఇప్పటికే బాబీ సినిమా మొదలుపెట్టారీయన.

మార్చ్ 29, 2024న దీన్ని విడుదల చేయాలని చూస్తున్నారు.. అంటే ఎన్నికలకు ముందే అన్నమాట. బాబీ తర్వాత సుకుమార్, NBK కాంబోలో దిల్ రాజు ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. బోయపాటి అఖండ 2కు ప్లాన్ చేస్తున్నారు.

గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడితోనూ కాంబో రిపీట్ కానుందంటున్నారు. ఇవన్నీ కాకుండా బాలయ్యతో ప్రశాంత్ వర్మ యూనివర్స్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మోక్షజ్ఞ కూడా ఉంటాడనే వార్తలొస్తున్నాయి. ఇవన్నీ జరిగితే ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయం.





























