- Telugu News Photo Gallery Cinema photos Tollywood actress Shraddha Das making rotis on a wood burning stove, Shares photos
Shraddha Das: కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్.. నెటిజన్ల క్రేజీ కామెంట్స్
2008లో అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధాదాస్. మొదటి సినిమాతోనే గ్లామరస్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. అయితే మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా రాణించడంలో ఈ అందాల తార బాగా వెనకబడిపోయింది.
Updated on: Jul 22, 2024 | 7:32 PM

2008లో అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధాదాస్. మొదటి సినిమాతోనే గ్లామరస్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. అయితే మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా రాణించడంలో ఈ అందాల తార బాగా వెనకబడిపోయింది.

అల్లు అర్జున్ ఆర్య 2, వెంకటేష్ నాగవల్లి, ప్రభాస్ డార్లింగ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా సెకెండ్ హీరోయిన్ గానే చేసింది శ్రద్ధాదాస్.

కాగా తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది శ్రద్ధాదాస్. హిందీలో ఖాకీతో పాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌ల్లో కనిపించింది.

లేటెస్ట్ గా పారిజాత పర్వం అనే సినిమాలో నటించిందీ అందాల తార. సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అందాల తార.

తాజాగా ఈ భామ మహారాష్ట్ర కు వెళ్లినప్పుడు ఓ పేదింటి మహిళ ఇంట్లోకి వెళ్లి కట్టెల పొయ్యి పై రొట్టెలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఆవిడకు వంట చేయడం వచ్చో.. రాదో.. తెలియదు గాని.. ఫోటోలకు మాత్రం బాగానే ఫోజులు ఇచ్చిందంటున్నారు.