- Telugu News Photo Gallery Cinema photos Hero Nagarjuna Akkineni is busy in digital with his next offers on July 2024 Telugu Heroes Photos
Nagarjuna Akkineni: డిజిటల్ లో బిజీ అవుతున్న నాగార్జున.. మన్మధుడు ఈజ్ బ్యాక్.!
నాగార్జున నెక్ట్స్ సినిమా ఏంటి..? నా సామిరంగా హిట్ అయిన తర్వాత కూడా ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నారు..? నేడో రేపో కొత్త సినిమా అనౌన్స్ చేస్తారనుకుంటే.. ఊహించని రీతిలో డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు ఈ సీనియర్ హీరో. సడన్‌గా బిగ్ బాస్ సీన్‌లోకి వచ్చేసిందిప్పుడు.. మరి ఈ లెక్కన నాగ్ హీరోగా చేయబోయే నెక్ట్స్ మూవీకి ఎంత టైమ్ పడుతుంది..? సంక్రాంతికి నా సామిరంగా అంటూ వచ్చి మంచి విజయం అందుకున్నారు నాగార్జున.
Updated on: Jul 22, 2024 | 8:02 PM

నాగార్జున నెక్ట్స్ సినిమా ఏంటి..? నా సామిరంగా హిట్ అయిన తర్వాత కూడా ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నారు..? నేడో రేపో కొత్త సినిమా అనౌన్స్ చేస్తారనుకుంటే.. ఊహించని రీతిలో డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు ఈ సీనియర్ హీరో.

సడన్‌గా బిగ్ బాస్ సీన్‌లోకి వచ్చేసిందిప్పుడు.. మరి ఈ లెక్కన నాగ్ హీరోగా చేయబోయే నెక్ట్స్ మూవీకి ఎంత టైమ్ పడుతుంది..? సంక్రాంతికి నా సామిరంగా అంటూ వచ్చి మంచి విజయం అందుకున్నారు నాగార్జున.

దీనికి ముందు చేసిన ఘోస్ట్ దారుణంగా నిరాశ పరిచింది. అయితే సంక్రాంతికి వచ్చినపుడు మాత్రం సత్తా చూపిస్తున్నారు నాగ్. 2021లో బంగార్రాజుతోనూ బంపర్ హిట్ కొట్టారు ఈ సీనియర్ హీరో.

అందుకే 2025 సంక్రాంతికి కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తానని ఆ మధ్య ప్రకటించారీయన. నాగార్జున ప్రస్తుతం హీరోగా సినిమాలేం చేయట్లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేరాలో మాత్రం కీలక పాత్రలో నటిస్తున్నారు.

కథలో అతి ముఖ్యమైన పాత్ర ఇది. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న కుబేరాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇది సెట్స్‌పై ఉండగానే తాజాగా బిగ్ బాస్ 8పై అనౌన్స్‌మెంట్ ఇచ్చారు నాగ్.

బిగ్ బాస్ 3 నుంచి నాగార్జున హోస్ట్‌గా కంటిన్యూ అవుతున్నారు. కనీసం 3 నెలలు ఈ షోపై ఫోకస్ చేస్తారీయన. ఈ లెక్కన సెప్టెంబర్ తర్వాతే నాగ్ కొత్త సినిమా ఉండబోతుంది.

గతంలో బంగార్రాజు, నా సామిరంగా లాంటి సినిమాల్ని 3 నెలల్లో పూర్తి చేసి.. సంక్రాంతికి విడుదల చేసారు కింగ్. ఈ సారి కూడా ఇదే సీన్ రిపీట్ చేస్తారేమో చూడాలిక.




