Telugu Heroes: కమెడియన్లు అనుకున్నారు కానీ కలెక్షన్లు కుమ్మేస్తున్నారుగా..!

క్రికెట్‌లో మ్యాచ్ ఎప్పుడు ఎవరి వైపు మళ్లుతుందో చెప్పలేం.. అలాగే సినిమా ఇండస్ట్రీలోనూ అంతే. ఎప్పుడు ఎవరి దశ ఎలా మారుతుందో ఊహించడం కష్టమే. ఎహే.. వీడేం చేస్తాడు.. కమెడియన్ అనుకుంటారు కొందర్ని చూసి.. కానీ వాళ్ళే తర్వాత చక్రం తిప్పుతుంటారు. సైడ్ హీరోగా కూడా పనికిరాడు అంటూ తీసిపారేసిన రవితేజ, చిరంజీవి, రజినీకాంత్ లాంటి వాళ్ళెందరో ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. అలాంటి టైమ్ అందరికీ రాదు.. వచ్చినపుడు మాత్రం వదులుకోకూడదు. 

Praveen Vadla

| Edited By: Prudvi Battula

Updated on: Nov 09, 2023 | 10:37 AM

క్రికెట్‌లో మ్యాచ్ ఎప్పుడు ఎవరి వైపు మళ్లుతుందో చెప్పలేం.. అలాగే సినిమా ఇండస్ట్రీలోనూ అంతే. ఎప్పుడు ఎవరి దశ ఎలా మారుతుందో ఊహించడం కష్టమే. ఎహే.. వీడేం చేస్తాడు.. కమెడియన్ అనుకుంటారు కొందర్ని చూసి.. కానీ వాళ్ళే తర్వాత చక్రం తిప్పుతుంటారు. సైడ్ హీరోగా కూడా పనికిరాడు అంటూ తీసిపారేసిన రవితేజ, చిరంజీవి, రజినీకాంత్ లాంటి వాళ్ళెందరో ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. అలాంటి టైమ్ అందరికీ రాదు.. వచ్చినపుడు మాత్రం వదులుకోకూడదు. ఇప్పుడు ఇదే పనిమీదున్నారు ఇద్దరు నటులు. వాళ్లు ముందు ఇండస్ట్రీకి వచ్చింది కమెడియన్లుగా..! ఏదో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం హీరోలుగా చక్రం తిప్పడానికి రెడీ అయిపోయారు.

1 / 5
అదిరిపోయే విజయాలు ఇవ్వడమే కాదు.. కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి వచ్చేసారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు సుహాస్. ఛాయ్ బిస్కెట్‌లో చిన్న చిన్న కామెడీ వీడియోలు చేసుకునే స్థాయి నుంచి 3 కోట్ల వరకు పారితోషికం తీసుకునే హీరోగా మారిపోయాడు సుహాస్. అసలు ఈయన ఎదుగుదల చూసి చాలా మందికి కుళ్లు వచ్చేస్తుందేమో..? అంతగా ఎదిగిపోతున్నాడు సుహాస్.

2 / 5
ఎంచుకునే కథలు, చేస్తున్న సినిమాలు అలా ఉన్నాయి మరి. ముఖ్యంగా పెద్ద బ్యానర్స్ నుంచి ఈయనకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలు సుహాస్ రేంజ్ పెంచేసాయి. ప్రస్తుతం ఈయన నటిస్తున్న అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్ బిజినెస్ 8 కోట్ల వరకు జరుగుతుంది. అలాగే మరో రెండు మూడు సినిమాలు హీరోగానూ కమిటయ్యాడీయన.

3 / 5
ఇదిలా ఉంటే తాజాగా సత్యం రాజేష్ సైతం హీరోగా బిజీ అవుతున్నాడు. పొలిమేర సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. తాజాగా దీని సీక్వెల్‌తో కాసుల పంట పండిస్తున్నాడు. ఈ సినిమా మూడు రోజుల్లోనే 5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సూపర్ హిట్ అయింది.

4 / 5
తాజాగా టేనెంట్ అనే మరో సినిమాలో హీరోగా కమిటయ్యాడు రాజేష్. మొత్తానికి ఇటు కమెడియన్లుగా కంటిన్యూ అవుతూనే.. మరోవైపు హీరోగానూ చక్రం తిప్పుతున్నారు ఈ నటులు. అందుకే అదృష్టం అనేది ఎప్పుడెలా తలుపు తడుతుందో చెప్పడం కష్టం.

5 / 5
Follow us