- Telugu News Photo Gallery Cinema photos Game Changer to Hanuman latest Film news from movie Industry
Film News: గేమ్ ఛేంజర్ నుంచి క్రేజి అప్డేట్.. హనుమాన్ ప్రమోషన్స్ షురూ..
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్. మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ యాత్ర 2. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా హనుమాన్. లోకనాయకుడు కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ బయటికి వచ్చాయి. హృతిక్ శౌర్య, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో చంద్రశేఖర్ ఆజాద్ తెరకెక్కిస్తున్న సినిమా అశ్వద్ధామ హత: అక్షర.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Nov 09, 2023 | 10:00 AM

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా సినిమా ఆడియో హక్కులను సరేగమా గ్లోబల్ సంస్థ తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సినిమా 2024లో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా పూర్తైంది. దివాళికి మొదటి సింగిల్ విడుదల కానుంది.

మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ యాత్ర 2. ఈ చిత్రంలో వైఎస్ జగన్ పాత్రని తమిళ నటుడు జీవా పోషిస్తుండగా.. రాజశేఖర్ రెడ్డిగా మమ్ముట్టి కంటిన్యూ అవుతున్నారు. ఈ మధ్యే షూటింగ్‌లో కూడా జాయిన్ అయ్యారాయన. తాజాగా ఇందులో సోనియా గాంధీ ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ పాత్రని ఓ ఆంగ్ల నటి సుజానే బెర్నెర్ట్ పోషిస్తుండగా సోనియా పాత్రకి ఆమె పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు.

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా హనుమాన్. సోషియో ఫాంటసీగా వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇందులో భాగంగానే ఇంటర్వ్యూలు ఇస్తున్నారు మేకర్స్. దాదాపు పాతిక కోట్ల బడ్జెట్‌తో వస్తుంది హనుమాన్ సినిమా.

లోకనాయకుడు కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ బయటికి వచ్చాయి. ఇందులో భాగంగానే ఇండియన్ 2లోని ఓ స్టిల్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. అందులో కమల్‌కు సీన్ వివరిస్తున్నారు దర్శకుడు శంకర్. అలాగే మణిరత్నంతో థగ్ లైఫ్, వినోద్‌తో మరో సినిమా చేస్తున్నారీయన.

హృతిక్ శౌర్య, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో చంద్రశేఖర్ ఆజాద్ తెరకెక్కిస్తున్న సినిమా అశ్వద్ధామ హత: అక్షర. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. దీన్ని చాలా ఆసక్తికరంగా డిజైన్ చేసారు మేకర్స్. త్వరలోనే సినిమా విడుదల కానుంది.





























