- Telugu News Photo Gallery Cinema photos Calling Sahasra to ala ninnu cheri latest movie updates from tollywood
Movie Updates: సుధీర్ కాలింగ్ సహస్ర సాంగ్ రిలీజ్.. ఘనంగా అలా నిన్ను చేరి ప్రీ రిలీజ్ ఈవెంట్..
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఘనంగా జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసారు. హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తున్నారు సుడిగాలి సుధీర్. తాజాగా ఈక్ష్న నటిస్తున్న సినిమా కాలింగ్ సహస్ర. ఈ ఏడాది పొన్నియన్ సెల్వన్, లియో లాంటి సెన్సేషనల్ సినిమాలు చేసిన త్రిష.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా బాగానే చేస్తున్నారు. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో మారేష్ శివన్ తెరకెక్కిస్తున్న సినిమా అలా నిన్ను చేరి. సంపూర్ణేష్, సంజోష్ ప్రధాన పాత్రల్లో మోహన్ మీనాంపల్లి తెరకెక్కిస్తున్న సినిమా సోదరా.
Updated on: Nov 09, 2023 | 9:34 AM

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఘనంగా జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసారు. ఇదిలా ఉంటే వీళ్ల పెళ్లి వీడియోకు సంబంధించిన ఓటిటి హక్కులపై వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని.. తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దంటూ కోరారు కుటుంబ సభ్యులు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని తెలిపారు మెగా ఫ్యామిలీ.

హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తున్నారు సుడిగాలి సుధీర్. తాజాగా ఈక్ష్న నటిస్తున్న సినిమా కాలింగ్ సహస్ర. అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ సరసన డాలిశ్య హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కనులా నీరు అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

ఈ ఏడాది పొన్నియన్ సెల్వన్, లియో లాంటి సెన్సేషనల్ సినిమాలు చేసిన త్రిష.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా బాగానే చేస్తున్నారు. ఈ మధ్యే ది రోడ్ అనే ఒక ఫిమేల్ మూవీలోనూ నటించారు ఈ బ్యూటీ. రివెంజ్ ఇన్ 462 కిలోమీటర్స్ అనేది ఈ మూవీ క్యాప్షన్. అరుణ్ వశీగరన్ తెరకెక్కించిన ది రోడ్ సినిమా నవంబర్ 10 నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది.

దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో మారేష్ శివన్ తెరకెక్కిస్తున్న సినిమా అలా నిన్ను చేరి. నవంబర్ 10న విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. దీనికి పలువరు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పారు దర్శక నిర్మాతలు.

సంపూర్ణేష్, సంజోష్ ప్రధాన పాత్రల్లో మోహన్ మీనాంపల్లి తెరకెక్కిస్తున్న సినిమా సోదరా. ఇట్స్ ఏ బ్రోమాంటిక్ స్టోరీ అనేది క్యాప్షన్. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సంపూర్ణేష్ బాబు, సంజోష్ పెళ్లి కొడుకు గెటప్‌లో ఎదురు చూస్తున్నట్లు ఈ పోస్టర్ డిజైన్ చేసారు.




