- Telugu News Photo Gallery Cinema photos These are the tollywood movie songs become most controversy in this year
Year Ender 2021: ఈ ఏడాది కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన పాటలు ఇవే.. మంగ్లీ నుంచి సమంత వరకు..
Year Ender 2021: ప్రేక్షకులను మధురమైన సంగీతంతో ఆకట్టుకునే పాటలు కూడా కొన్ని సందర్భాల్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంటాయి. అలా 2021లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కొన్ని పాటలో ఓ లుక్కేయండి..
Updated on: Dec 25, 2021 | 8:23 PM

2021లో నాగశైర్య, రితూ వర్మ నటీనటులుగా తెరకెక్కిన వరుడు కావెలను సినిమాలోని 'దిగు దిగు దిగు నాగ' పాట వివాదంగా మారింది. ఈ పాటను రాసి అనంత శ్రీరామ్‌పై క్రిమినల్ కేసులు పెట్టారు. భక్తి పాటను ఐటెం సాంగ్ చేస్తారా.? అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రముఖ గాయనీ మంగ్లీ పాడిన ‘మైసమ్మ’ పాట కూడా కాంట్రవర్సీకి దారి తీసింది. ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసం మంగ్లీ పాడిన ‘చెట్టు కింద కూసున్నవమ్మా చుట్టం లెక్క ఓ మైసమ్మా…’, ‘మోతెవరి’ లాంటి పదాలపై కొన్ని హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

కాపీ కారణంగా కాంట్రవర్సీగా మారింది సాయి పల్లవి నటించిన 'సారంగదరియా’ పాట. జానపద గేయాన్ని మార్చి రాసిన సుద్ధాల అశోక్ తేజ దాని ఒరిజినల్‌ను సేకరించిన వ్యక్తికి క్రెడిట్ ఇవ్వలేదనే విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ ఏడాది కాంట్రవర్సీగా మారిన పాటల్లో ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమాలోని భజ గోవిందం అనే పాటపై దుమారం చెలరేగింది. భక్తి పాటను అశ్లీలంగా చిత్రీకరించారంటూ కొందరు వాదించారు. దీంతో ఈ పాట వివాదానికి దారి తీసింది.

ఇక ఈ ఏడాది చివర్లో వచ్చిన పుష్పలోని 'ఊ అంటావా మామ.. ఉఉ అంటావా' పాట కూడా వివాదానికి అడ్రస్‌గా మారింది. సమంత స్పెషల్ సాంగ్‌గా తెరకెక్కిన ఈ పాటలో పురుషుల మనోభావాలను దెబ్బ తీసేలా చరణలు ఉన్నాయని కొందరు కేసు నమోదు చేశారు.




