Singer Revanth: పెళ్లిపీటలెక్కనన్న ప్రముఖ సింగర్.. రేవంత్ ఎంగేజ్మెంట్ ఫొటోస్
‘మనోహరి’ పాటతో ఎంతోమంది సంగీతాభిమానుల మనసులను గెల్చుకున్నాడు ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ రేవంత్.
Updated on: Dec 26, 2021 | 8:38 AM

‘బాహుబలి’ సినిమాలోని ‘మనోహరి’ పాటతో ఎంతోమంది సంగీతాభిమానుల మనసులను గెల్చుకున్నాడు ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ రేవంత్.

తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల్లో వందలాది పాటలకు గొంతు సవరించుకున్న రేవంత్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెబుతూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నాడు.

అన్విత అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమయంలో కాబోయే భార్యతో ఉంగరాలు మార్చుకున్నాడు.

తన ఎంగేజ్‌మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోయాడు.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ కాబోయే దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

తెలుగుతో పాటు కన్నడలోనూ మంచి ప్లే బ్యాక్ సింగర్‌గా గుర్తింపు పొందిన రేవంత్ ఇప్పటివరకు దాదాపు 200కు పైగా పాటలు ఆలపించాడు.





























