- Telugu News Photo Gallery Cinema photos These are the super hit movies rejected by star heroine Samantha
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏమాయ చేశావే సినిమాతో వెండితెరకు పరిచయమై మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో జెస్సీ పాత్రలో ఈ అమ్మడు తన అందం, నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. దీంతో వరసగా స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ లు రావడంతో, అందరి సరసన నటించి స్టార్ స్టేటస్ అందుకుంది. అంతే కాకుండా ఈ బ్యూటీ చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో టాలీవుడ్ లక్కీ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడు కొన్ని సూపర్ హిట్ సినిమాలు రిజక్ట్ చేసిందంట. అవి
Updated on: Apr 05, 2025 | 9:08 PM

సమంత, నాని కాంబోలో రెండు సినిమాలు వచ్చి మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే అలాగే నాని సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన నిన్ను కోరి మూవీకి మొదటగా డైరెక్టర్ సమంతను సంప్రదించగా ఆమె డేట్స్ ఖాలీ లేకపోవడంతో రిజక్ట్ చేసిందంట.

అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా సినిమా పుష్ప. ఈ సినిమాలో రష్మిక స్థానంలో మొదటగా సుకుమార్ సమంతను తీసుకుందాం అనుకున్నారంట. కానీ అప్పుడే సమంత విడాకులు తీసుకోవడంతో తాను కాదనడంతో రష్మికకు అవకాశం వచ్చింది.

శంకర్, విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఐ. ఈ మూవీలో హీరోయిన్ గా అమీర్ జాక్సన్ నటించింది. అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను అనౌన్స్ చేశారు . కానీ కొన్ని కారణాల వలన సమంత ఈ మూవీ నుంచి తప్పుకున్నదంట.

రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సినిమా ఎవడు. అయితే ఈ సినిమాలో మొదటగా సమంతను హీరోయిన్ గా అనుకున్నారంట కానీ, సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతనున్నందున ఈ సినిమాను రిజక్ట్ చేసిందంట.

బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఈ మూవీ కోసం కూడా ముందుగా సమంతను తీసుకోవాలని చూసినా దీనికి సమంత ఆసక్తి చూపలేదంట





























