- Telugu News Photo Gallery Cinema photos These are the South actresses who are playing heroines in Bollywood
South Actress: బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న సౌత్ భామలు వీరే..
నిన్న మొన్నటివరకు సౌత్ లోనే తమ సత్తా చాటిన ముద్దుగుమ్మలు ఇప్పుడు నార్త్ లోనూ మెమెంటో చూపిస్తాం అంటున్నారు. నార్త్ లో రాణించిన సౌత్ భామల్లో ముందుగా చెప్పుకోల్సింది. పూజా హెగ్డే గురించే. తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది పూజా. అక్కడ హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోల సరసన నటించింది.
Updated on: Sep 10, 2023 | 1:54 PM

నిన్న మొన్నటివరకు సౌత్ లోనే తమ సత్తా చాటిన ముద్దుగుమ్మలు ఇప్పుడు నార్త్ లోనూ మెమెంటో చూపిస్తాం అంటున్నారు. నార్త్ లో రాణించిన సౌత్ భామల్లో ముందుగా చెప్పుకోల్సింది. పూజా హెగ్డే గురించే. తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది పూజా. అక్కడ హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోల సరసన నటించింది.

ఆ తర్వాత రష్మిక మందన్న కూడా బాలీవుడ్ లో సత్తా చాటింది. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న రష్మిక. బాలీవుడ్ లో టాప్ టక్కర్’ అనే ప్రైవేటు ఆల్బమ్ తో అడుగుపెట్టింది. ఆతర్వాత అక్కడ క్రేజీ ప్రాజెక్ట్స్ అందుకుంది. ఏకంగా అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించింది ఈ బ్యూటీ.

స్టార్ హీరోయిన్ సమంత కూడా నార్త్ లో నటించి మెప్పించింది. హిందీలో తెరకెక్కిన ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్ తో అక్కడై ప్రేక్షకులను పలకరించింది సమంత. అలాగే సెటాడియల్ అనే సిరీస్ లోనూ నటించింది. వరుణ్ ధావన్ నటిస్తున్న నయా మూవీలోనూ హీరోయిన్ గా చేసింది సామ్.

అలాగే ఇలియానా తెలుగులో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే హిందీలోకి అడుగు పెట్టింది. అక్కడ పలు సినిమాల్లో నటించి ఆతర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అలాగే ఆసిన్ కూడా బాలీవుడ్ లో గజినీ సినిమా చేసింది. శ్రీయ ‘తుజే మేరి కసమ్' అనే సినిమా చేసింది.

తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా బాలీవుడ్ లో సత్తా చాటారు. రీసెంట్ గా ఆమె షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పటికే 300కోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది జవాన్ మూవీ.