- Telugu News Photo Gallery Cinema photos Hero gopichand and director sreenu vaitla movie start with pooja ceremony photos Telugu Entertainment Photos
Gopichand – Srinu Vaitla: ఇక ఎంటర్టైన్మెంట్ షురూ.! గోపీచంద్ టైమింగ్ కి శ్రీను వైట్ల కామెడీ..
ఇండస్ట్రీలో కాంబినేషన్స్ అంటే ఎంతసేపూ హీరో హీరోయిన్.. హీరో డైరెక్టర్ అనుకుంటారు.. కానీ డైరెక్టర్ రైటర్ కాంబినేషన్స్‌కు కూడా మంచి క్రేజ్ ఉంటుంది మన దగ్గర. ఒకప్పుడు బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన అలాంటి రెండు క్రేజీ కాంబినేషన్స్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతున్నారు. మేమున్నాం అని గుర్తు చేయడానికి తంటాలు పడుతున్నారు. కొత్త సినిమాలతో వచ్చేస్తున్నారు. ఇంతకీ ఎవరా డైరెక్టర్ రైటర్స్.. ఈ సారైనా వాళ్లు ట్రాక్ ఎక్కుతారా..?
Updated on: Sep 10, 2023 | 1:50 PM

ఇండస్ట్రీలో కాంబినేషన్స్ అంటే ఎంతసేపూ హీరో హీరోయిన్.. హీరో డైరెక్టర్ అనుకుంటారు.. కానీ డైరెక్టర్ రైటర్ కాంబినేషన్స్‌కు కూడా మంచి క్రేజ్ ఉంటుంది మన దగ్గర. ఒకప్పుడు బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన అలాంటి రెండు క్రేజీ కాంబినేషన్స్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతున్నారు.

మేమున్నాం అని గుర్తు చేయడానికి తంటాలు పడుతున్నారు. కొత్త సినిమాలతో వచ్చేస్తున్నారు. ఇంతకీ ఎవరా డైరెక్టర్ రైటర్స్.. ఈ సారైనా వాళ్లు ట్రాక్ ఎక్కుతారా..? శ్రీను వైట్ల.. పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు ఈయన రూలర్.. కానీ ఇప్పుడు కాదు.

పదేళ్లుగా సరైన సక్సెస్ లేక.. కనీసం శ్రీను వైట్ల అనే ఓ దర్శకుడున్నాడనే సంగతి కూడా మర్చిపోయారు ఆడియన్స్. దాంతో నేనున్నానని గుర్తు చేయడానికి తంటాలు పడుతున్నారు వైట్ల. ఈ క్రమంలోనే ఐదేళ్ళ తర్వాత కొత్త సినిమా మొదలుపెట్టారు.

గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల సినిమా మొదలైంది.. దీనికి గోపీ మోహన్ కథ అందిస్తున్నారు.వెంకీ, ఢీ, రెడీ, దూకుడు, బాద్షా లాంటి సినిమాలకు గోపీ మోహన్‌తో కలిసి పని చేసారు శ్రీను వైట్ల. అప్పుడు వాళ్లకు తోడుగా కోన వెంకట్ కూడా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి ఎన్నో మ్యాజిక్స్ చేసారు.

కానీ వాళ్లతో విడిపోయాక శ్రీను వైట్లకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. చాలా రోజుల తర్వాత కలిసొచ్చిన రైటర్‌తో సినిమా షురూ చేసారు. ఇక సురేందర్ రెడ్డి కూడా తన లక్కీ రైటర్ వక్కంతం వంశీతో కలిసి పవన్ సినిమాకు వర్క్ స్టార్ట్ చేసారు.

సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కలిసి కిక్, రేసు గుర్రం లాంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చారు. అలాగే కిక్ 2, ఏజెంట్ లాంటి ఫ్లాపులు కూడా ఇచ్చారు. తాజాగా మరోసారి వక్కంతంతోనే కలిసి పవన్ సినిమాకు పని మొదలు పెట్టారు. ఈ మధ్యే ఆఫీస్ తీసుకున్నారు. పవన్ ప్రస్తుతం ఓజి, ఉస్తాద్, వీరమల్లుతో బిజీ బిజీగా ఉన్నారు. ఎలక్షన్స్ తర్వాతే పవన్, సురేందర్ రెడ్డి సినిమా పట్టాలెక్కనుంది. మరి ఈ లక్కీ కాంబోస్ మళ్ళీ ట్రాక్ ఎక్కుతాయా లేదా చూడాలి.




