- Telugu News Photo Gallery Cinema photos Star heroine Rakul Preet Singh bought a luxury car worth 3 crore
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ గ్రారేజ్‌లో లగ్జరీ కారు.. కాస్ట్లీ కారు కొన్న క్యూటీ.. ధర ఎంతో తెలుసా..
కెరటం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఆతర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఏక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా లో తన నటనతో ఆకట్టుకుంది రకుల్.
Updated on: Sep 10, 2023 | 1:36 PM

కెరటం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఆతర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఏక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా లో తన నటనతో ఆకట్టుకుంది రకుల్.

ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ అందుకుంది. వెంకటాద్రి ఏక్స్ ప్రెస్ తర్వాత రకుల్ నటించిన లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి సినిమా సూపర్ హిట్స్ గా నిలిచాయి.

దాంతో తమిళ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఈ బ్యూటీకి ఆఫర్స్ వచ్చాయి. అక్కడ కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించింది. అలాగే హిందీలోనూ సినిమాలు చేసింది. కానీ అక్కడ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ నటించి మెప్పించింది రకుల్.

ఇక ఈ అమ్మడికి టాలీవుడ్లో ఆఫర్స్ తగ్గాయనే చెప్పాలి తెలుగులో చివరగా చేసిన కొండపోలం సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేకపోయింది. దాంతో టాలీవుడ్ కు దూరం అయ్యింది రకుల్. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు అభిమానులను అక్కటుకుంటుంది.

ఇదిలా ఉంటే రకుల్ తాజాగా ఓ కొత్త కారు కొన్నది. బెంజ్ కంపెనీకి చెందిన ఓ లగ్జరీ కారును కొన్నట్టు తెలుస్తోంది. దీని ధర దాదాపు 3 కోట్లరూపాయలు ఉంటుందట. రకుల్ గ్యారేజ్ లో ఇప్పటికే చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు మరోకారు వచ్చి చేరిందని తెలుస్తోంది.




