- Telugu News Photo Gallery Cinema photos These are the Bollywood star actors who are acting in Tollywood movies
Bollywood: సౌత్ నార్త్ ఇండస్ట్రీస్ మింగిల్.. మన సినిమాల్లో బాలీవుడ్ బడా యాక్టర్స్
సౌత్ నార్త్ ఇండస్ట్రీస్ మింగిల్ అవుతున్నాయి. బాలీవుడ్‌లో సీనియర్ సెగ్మెంట్‌లోకి ఎంటర్ అయిన స్టార్స్ సౌత్‌లో సపోర్టింగ్ రోల్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. బాలీవుడ్‌తో పోలిస్తే సౌత్ ఇండస్ట్రీలోనే ఈ స్టార్స్‌కు బాగా గిట్టుబాటు అవుతుందట. కేజీఎఫ్ 2 సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ సీనియర్ సంజయ్ దత్. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమా కోసం హీరోతో సమానంగా పేమెంట్ అందుకున్నారు సంజయ్. అంతేకాదు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో సంజు బాబా డేట్స్ కోసం క్యూ కడుతున్నారు సౌత్ మేకర్స్.
Updated on: Aug 04, 2023 | 1:47 PM

సౌత్ నార్త్ ఇండస్ట్రీస్ మింగిల్ అవుతున్నాయి. బాలీవుడ్‌లో సీనియర్ సెగ్మెంట్‌లోకి ఎంటర్ అయిన స్టార్స్ సౌత్‌లో సపోర్టింగ్ రోల్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. బాలీవుడ్‌తో పోలిస్తే సౌత్ ఇండస్ట్రీలోనే ఈ స్టార్స్‌కు బాగా గిట్టుబాటు అవుతుందట.

కేజీఎఫ్ 2 సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ సీనియర్ సంజయ్ దత్. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమా కోసం హీరోతో సమానంగా పేమెంట్ అందుకున్నారు సంజయ్. అంతేకాదు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో సంజు బాబా డేట్స్ కోసం క్యూ కడుతున్నారు సౌత్ మేకర్స్.

ప్రజెంట్ విజయ్ లియోతో పాటు పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్‌లోనూ కీ రోల్స్‌లో నటిస్తున్నారు సంజయ్ దత్. ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలోనూ సంజయ్ దత్ నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాల కోసం బాలీవుడ్లో తీసుకునే పేమెంట్ కన్నా చాలా ఎక్కువ పారితోషికం అందుకుంటున్నారట బాబా.

ఆదిపురుష్ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన సైఫ్ అలీఖాన్ కూడా సౌత్ జర్నీని కంటిన్యూ చేస్తున్నారు. బాలీవుడ్‌లో హీరోగా ఫుల్ బిజీగా ఉన్న సైఫ్, సౌత్‌లో నెగెటివ్ రోల్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రజెంట్ ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న దేవర సినిమాలో నెగెటివ్ పాత్రలో నటిస్తున్నారు సైఫ్.

ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఇప్పుడు సౌత్ సినిమా మీద సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు. సైరా నరసింహారెడ్డి సినిమాలో గెస్ట్ రోల్ చేసిన అమితాబ్, ప్రజెంట్ కల్కి 2898 ఏడీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. పవన్ సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఓజీలోనూ బిగ్ బీ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాలకు భారీ పారితోషికం అందుకుంటున్నారు అమితాబ్.




