- Telugu News Photo Gallery Cinema photos Tamil hero dhanush kriti sanon movie latest update on 22 03 2025
Kriti Sanon: రూట్ మార్చిన కృతి సనన్.. ధనుష్ హెల్ప్ చేస్తారా ??
ఉన్నచోట ఎంత పేరొస్తే ఏంటి? అడపాదడపా పొరుగున కూడా పేరు రావాలి కదా.. ఎలాగోలా అక్కడ అవకాశాలైతే వచ్చేస్తున్నాయి గానీ, వాటిని నిలబెట్టుకోదగ్గ పేరు తెచ్చుకోవడం మామూలు విషయం కాదు.. అని అంటున్నారు కృతి సనన్. జస్ట్ అని ఊరుకోవడం లేదు.. పేరు తెచ్చుకోవడానికి వీర లెవల్లో ప్రయత్నాలు చేస్తున్నారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Mar 22, 2025 | 12:21 PM

కృతి సనన్ అనే పేరు మనకి అసలు కొత్త కాదు. కెరీర్ స్టార్టింగ్‌లోనే నాగచైతన్యతో, కాస్త నిలదొక్కుకోగానే మహేష్‌తో నటించేశారు. అప్పట్లో అవకాశాలైతే వచ్చాయిగానీ, హిట్టే పలకరించలేదు ఈ బ్యూటీని.

తెలుగు ఇండస్ట్రీకి కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన కృతి, ఈ మధ్య ఆదిపురుష్ చేశారు. డార్లింగ్‌కీ, కృతికీ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందంటూ వార్తలు వచ్చింది కూడా ఆదిపురుష్ టైమ్‌లోనే. అయితే మేం అనుకున్న మర్యాదపురుషోత్తముడి కథ ఇది కాదంటూ సినిమాను ఆదరించలేదు ఆడియన్స్.

దాంతో కృతి మరోసారి నార్త్ కే పరిమితమయ్యారు. ఉత్తరాదిని ఓ వైపు నిర్మాతగా అడుగులు వేస్తూ, మరోవైపు నచ్చిన సినిమాలు చేస్తూ కెరీర్‌ని కంటిన్యూ చేస్తున్నారు. కృతి సినిమా యాక్సెప్ట్ చేశారంటే, జస్ట్ అదేదో గ్లామర్ పర్పస్ మాత్రమే కాదనే క్లారిటీ వచ్చేసింది ఆడియన్స్ కి. అందుకే ఆమె సినిమాల కోసం వెయిట్ చేసే స్పెషల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ క్రియేట్ అయ్యారు.

లేటెస్ట్ గా మరోసారి సౌత్ హీరోతో జోడీ కడుతున్నారు కృతి. ధనుష్ హీరోగా రూపొందుతున్న తేరే ఇష్క్ మే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా సౌత్‌లో ప్రూవ్ చేసుకోవాలన్నది ఈ బ్యూటీ టార్గెట్.

నవంబర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది తేరే ఇష్క్ మే. హిందీ, తమిళ్ ప్రధానంగా రూపొందిస్తున్నారు మేకర్స్. తెలుగులో రాని సక్సెస్, తమిళంలో అయినా వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కృతి.





























