ఫ్యాన్స్‌కు నచ్చకపోయినా సరే.. ఆ సినిమానే ఇష్టం అంటున్న ప్రభాస్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాహుబలి తర్వాత వరల్డ్ వైడ్‌గా ఈ హీరోకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న డార్లింగ్ ప్రభాస్‌కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ అది ఏమిటంటే?
Updated on: Mar 22, 2025 | 12:29 PM

రెబెల్ స్టార్ మూవీస్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటది. కానీ ఈ మధ్య డార్లింగ్ చేసిన ఓ మూవీ ప్రభాస్ ఫ్యాన్స్‌కు అస్సలే నచ్చలేదు. అంతే కాదండోయ్ తమ అభిమాన హీరో ఆ మూవీలో నటించకుంటే బాగుండు అని చాలా మంది అన్నారంట.

ఇంతకీ అది ఏ మూవీ అంటే? ప్రభాస్ ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా బాహుబలి తర్వాత ఈ హీరో క్రేజ్ పెరగడంతో ఆయన సినిమా పై మంచి హైప్ నెలకొంది.

దీంతో ప్రభాస్ ఏ మూవీ చేసినా, అది బ్లాక్ బస్టర్ ఖాయం అని ఫిక్స్ అయిపోయారు అందరు. కానీ ఎవరూ ఊహించని విధంగా ప్రభాస్ పాన్ ఇండియా స్టేటస్ అందుకున్న తర్వాత ఆది పురుష్ సినిమా చేసి డిజాస్టర్ సొంతం చేసుకున్నారు.

ఈ మూవీ అంటే ప్రభాస్ ఫ్యాన్స్‌కు అస్సలే నచ్చదంట. ఎందుకంటే ఈ మూవీతో ప్రభాస్‌కు నెగిటివిటీ ఎక్కువ వచ్చింది. కానీ ప్రభాస్‌కు మాత్రం ఈ సినిమానే ఫేవరెట్ మూవీ అంట.

ప్రభాస్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు, యాంకర్ మీ సినిమాల్లో మీకు ఇష్టమైన 10 సినిమాలు చెప్పమని అడగ్గా అందులో ఆదిపురుష్ కూడా ఉండటం గమనార్హం. దీంతో తన అభిమానులకు నచ్చని ఆదిపురుష్ మూవీ డార్లింగ్‌కు చాలా ఇష్టం అంట అంటూ ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.





























