మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగులో సినిమాలు తగ్గించేసిందా..? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. ఒకప్పుడు టాలీవుడ్ లో బిజీగా గడిపింది ఈ చిన్నది. వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా రాణించింది. స్టార్ హీరో సినిమా అంటే తమన్నా హీరోయిన్ గా ఉండాల్సిందే . దాదాపు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించింది తమన్నా. అలాగే తమిళ్ లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ కూడా స్టార్ హీరోలతో జతకట్టింది ఈ చిన్నది. ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గించింది ఈ బ్యూటీ.