Suriya: ఆ టాప్ డైరెక్టర్ తో సూర్య నయా సినిమా.. ఇంకా హిట్ పక్క అంటున్న ఫ్యాన్స్
పొరుగు హీరోలకి టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌లు బాగా కలిసొస్తున్నాయి. కోలీవుడ్, మాలీవుడ్ నుంచి తెలుగుకి ఎంట్రీ ఇచ్చిన హీరోలు ఇప్పటికే బంపర్ హిట్ అయ్యారు. ఇప్పుడు సూర్య వంతు.. నడిప్పిన్ నాయగన్ చిరకాల కల నెరవేరుతుందా? ప్యాన్ ఇండియా కల్చర్ పాపులర్ అయినప్పటి నుంచీ మన హీరోలతో పొరుగు నిర్మాతలు సినిమాలు చేయడం, అక్కడి హీరోల కాల్షీట్లు మనవాళ్లు తీసుకోవడం మామూలైపోయింది.
Updated on: Apr 30, 2025 | 9:51 PM

ప్యాన్ ఇండియా కల్చర్ పాపులర్ అయినప్పటి నుంచీ మన హీరోలతో పొరుగు నిర్మాతలు సినిమాలు చేయడం, అక్కడి హీరోల కాల్షీట్లు మనవాళ్లు తీసుకోవడం మామూలైపోయింది. మన ప్రొడక్షన్ హౌసులను నమ్మి కాల్షీట్ ఇచ్చిన హీరోలను ఇప్పటిదాకా హిట్లే పలకరించాయి.

దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలనైతే పొరుగు వారిగా చూడటం ఎప్పుడో మానేశారు తెలుగు జనాలు. తెలుగులో అన్ని హిట్లు అందుకున్నారు దుల్కర్. లాస్ట్ ఇయర్ దీపావళి సమయంలో లక్కీ భాస్కర్‌తో పూర్తిగా తెలుగుహీరోగా మారిపోయి, ఇక్కడే మూవీస్ కంటిన్యూ చేస్తున్నారు దుల్కర్.

గత కొన్నాళ్లుగా సంప్‌లో ఉన్న అజిత్ కెరీర్‌కి ఓ మంచి హిట్ ఇచ్చింది తెలుగు ప్రొడక్షన్ హౌస్. గుడ్ బ్యాడ్ అగ్లీతో ఈ ఏడాది మంచి హిట్ అందుకున్నారు తల. ధనుష్, విజయ్, అజిత్ సక్సెస్ చూసిన టాలీవుడ్‌లో తాను కూడా పర్ఫెక్ట్ హిట్ అందుకుంటానని భావిస్తున్నారు సూర్య.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో సినిమా చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అనౌన్స్ చేశారు సూర్య. వెంకీ అట్లూరితో మూవీకి రెడీ అవుతున్నానన్నది రెట్రో వేడుకలో ఆయనిచ్చిన మాట.

ఆయన చేసిన కంగువ నిర్మాణంలో యువీ క్రియేషన్స్ కి కూడా భాగస్వామ్యం ఉంది. అయినా ఆ సినిమాతో అందని హిట్‌ని, వెంకీ డైరక్షన్‌లో అందుకోవాలనే ఆశతో ఉన్నారు సూర్య.




